twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జీవిత టార్చర్ తట్టుకోలేక అవాయిడ్ చేస్తున్న రాజశేఖర్..!?

    By Sindhu
    |

    జీవిత అంటే రాజశేఖర్, రాజశేఖర్ అంటే జీవిత అనే విధంగా ఉంటున్నారు ఈ జీవిత రాజశేఖర్ దంపతులు. రాజశేఖర్ నంటించే ప్రతి చిత్రంలో కూడా వేలు పెట్టి గెలికేడం జీవితకు అలవాటే. రాజశేఖర్ ఎక్కడ ఉంటే జీవిత అక్కడ ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందట. రాజశేఖర్ 'అర్జున" సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్ లోకి జీవితను తీసుకురావడంలేదట రాజశేఖర్. ఆమెను పూర్తిగా అవాయిడ్ చేసాడని ఫిల్మిం ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

    దానికి కారణం లేకపోలేదు. 'మహంకాళి" చిత్రం షూటింగ్ సమయంలో జీవిత టార్చర్ ను తట్టుకోలేక చాలామంది టెక్నీషియన్స్ మానేసారట. దానివల్ల సినిమా లేట్ అయ్యిందనే భావన రాజశేఖర్ లో ఉందట. అందుకే జీవితను 'అర్జున" సినిమాకి సంబంధించి ఏ విషయం కూడా పట్టించుకోనివ్వడంలేదని విశ్వసనీయ సమాచారం.

    ప్రస్తుతం రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా 'అర్జున". కన్మణి దర్శకుడు ఏఏ ఆర్ట్స్ పతాకంపై కె చంద్రశేఖర్ (జీతు), ఎ ఉదయ్ శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హైదరాబాద్ నానక్ రామ్ గూడలో రెండవ షెడ్యూల్ చిత్రీకరణ జరగుతోంది.

    గతంలో ప్రముఖ దర్శకడు సముద్ర దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా సింహరాశి, 'ఎవడైతే నాకేంటి" వంటి చిత్రాలు వచ్చాయి. ఇటీవలే విడుదలైన 'ఎవడైతే నాకేంటి" చిత్రం మంచి విజయం సాధించింది. అయితే ఈ విజయంలో దర్శకుడు సముద్రకు పలు సూచనలు ఇచ్చాను అంటూ దర్శకత్వం జాబితా లిస్ట్లో జీవిత తన పేరును కూడా చేర్చేసుకుంది. రాజశేఖర్ తో సినిమా చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ కథలో, దర్శకత్వంలో బాధ్యతలో ఇంటర్ ఫియర్ కాకుడదంటూ, సెట్ లో జీవిత రాకూడదంటూ దర్శకుడు సముద్ర తెగేసి చెప్పేశాడంట.

    English summary
    One couple from the cine family who always tries to keep themselves in the lime light is angry hero Rajasekhar and his bold wife Jeevitha. However, all is not well between the two from a couple of months. Check out the story now!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X