రామ్ చరణ్ ను గ్యాంగ్ లీడర్ గా చూడాలని ఉంది...!?
మెగాస్టార్ చిరంజీవి పాత సినిమాలు రామ్ చరణ్ తో రీమేక్ చేస్తారని, దానికి సంబంధించిన డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయన్న వార్తలు ఈ మద్య వస్తున్నాయి. మెగాస్టార్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మీ హిట్ సినిమాల్లో జగదేకవీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఖైదీ, ఘరానామొగుడు ఈ నాలుగు సినిమాల్లో రామ్ చరణ్ కి ఏది ఫర్ ఫెక్ట్ గా సూట్ అవుతుంది, చరణ్ ని ఏ సినిమా చెయ్యమని సలహా ఇస్తారని చిరంజీవిని అడిగితే 'అందరికీ రీచ్ కావాలంటే గ్యాంగ్ లీడర్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.
ఎందుకంటే ఆ సినిమాలో అన్ని రకాల ఎలిమెంట్స్ వున్నాయి. చక్కని ఫ్యామిలీ వుంది, మంచి ఫ్రెండ్స్ వున్నారు. అన్నింటినీ మించి మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే అంశాలన్నీ వున్నాయి" అన్నారు. ఈ సినిమా 20సంవత్సరాల క్రితం వచ్చిబారీ కలెక్ష కలెక్ చేయడమే కాక, విజయవాడ, వైజాగ్, హైదరాబ్, ఏలూర్ లలో 100 డేస్ ఫంక్షన్ జరుపుకొన్నది. అలాంటి సినిమా మెగాస్టార్ నోటివెంట వచ్చిన గ్యాంగ్ లీడర్ ను రామ్ చరణ్ తో రీమేక్ చేసేందుకు ఎవరు ముందుకు వస్తారో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











