»   » రామ్ చరణ్ ఇక బాబాయ్ ‘పవర్’ వాడుకోడా?

రామ్ చరణ్ ఇక బాబాయ్ ‘పవర్’ వాడుకోడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా కుటుంబంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తూ ఆ పార్టీని అధికారంలోకి తేవడానికి అన్నయ్య చిరంజీవికి ముందుకు సాగుతుంటే....తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆయన విధానాలకు పూర్తి విరుద్దంగా బీజేపీ, టీడీపీతో చేతులు కలిపారు. కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

కాగా....ఇప్పటి వరకు రామ్ చరణ్‌ను అందరు 'మెగా పవర్ స్టార్' అని పిలుస్తూ వస్తున్నారు. సినిమా టైటిళ్లలో కూడా ఆయన పేరు ముందు ఇదే బిరుదు వేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసత్వం పునికి పుచ్చుకుని రావడంతో రామ్ చరణ్‌కు ఈ బిరుదు ఇచ్చారు.

Is Ram Charan to use Pawan's power in his next?

నాన్న చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్ మధ్య రాజకీయ అంశాల పరంగా విబేదాలు రావడంతో.....తన మద్దతు పూర్తిగా నాన్నకే అని తేల్చి చెప్పాడు రామ్ చరణ్. ఇకపై బాబాయ్‌కి పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఆయన ద్వారా తనకు సంక్రమించిన 'పవర్' బిరుదును కూడా తొలగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఒక రాబోయే రామ్ చరణ్ సినిమా టైటిళ్లలో 'మెగా పవర్ స్టార్' అని వేసుకోకూడదని నిర్ణయించినట్లు సమాచారం. పవర్ తీసేస్తే మిగిలేది 'మెగా స్టార్'. అయితే ఈ బిరుదు అందుకునే అర్హత రామ్ చరణ్ ఇంకా సాధించలేదని పలువురి అభిప్రాయం. మరి రాబోయే సినిమాల్లో రామ్ చరణ్ పేరు ముందు ఏం బిరుదు దర్శనమిస్తుందో చూడాలి. ప్రస్తుతం రామ్ చరణ్ కృష్ణ వంశీ దర్శకత్వంలో 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రంలో నటిస్తున్నాడు.

English summary
Ram Charan was given the nickname Mega Power Star with a long foresight of getting Pawan's fan base as well as Chiru's fans. Is Ram Charan to use Pawan's power in his next?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu