బలగం వేణును యంగ్ డైరెక్టర్ రిజెక్ట్ చేశాడా? సినిమాలో ఆఫర్ ఇచ్చినట్టే ఇచ్చి చీటింగ్.. అసలేం జరిగిందంటే!

కమెడియన్‌గా ఆకట్టుకొంటున్న నవీన్ బేతిగంటి, అన్వేష్ మైఖేల్, యాదమ రాజు, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రాక్షస కావ్యం.తెలంగాణ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్‌లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఉమేష్, నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రాక్షస కావ్యం చిత్రానికి శ్రీమాన్ కీర్తి దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం (17వ ఆగస్టు) రాక్షస కావ్యం సినిమా టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో బలగం దర్శకుడు వేణు యెల్దండి, యంగ్ హీరో తిరువీర్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తూ..

మా సినిమా రాక్షస కావ్యం టీజర్ రిలీజ్ కార్యక్రమానికి వచ్చిన దర్శకుడు వేణు, హీరో తిరువీర్ కు థాంక్స్ చెబుతున్నా. రాక్షస కావ్యం మూవీతో ఒక భిన్నమైన ప్రయత్నం చేశాం. మైథాలజీని నేటి సామాజిక పరిస్థితులకు అన్వయించి ఒక కొత్త తరహా సినిమా నిర్మించాం. మా మూవీ ఒక డార్క్ కామెడీలా అనిపించవచ్చు. కానీ మంచి హ్యూమన్ ఎమోషన్స్ ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్ మీకు పరిచయం ఉన్నట్లు, కథ మన చుట్టూ జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇవాళ కొత్త కంటెంట్ ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మా సినిమాను కూడా ఇష్టపడతారని ఆశిస్తున్నాం అని నిర్మాత దాము రెడ్డి అన్నారు.

Is Ramanna Youth Director Naveen Bethiganti rejected Balagam Director Venu Veldandi?

దర్శక, నిర్మాత గురించి నటుడు, కమెడియన్ యాదమ్మ రాజు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. నేను ఈటీవీలో పటాస్ అనే షో చేస్తున్నప్పుడు దాము అన్న పిలిచి గువ్వ గోరింక సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఆయన చేసే ప్రతి సినిమాలో నేనుంటాను. దాము అన్నకు థాంక్స్ చెబుతున్నా. ఈ సినిమా అదిరిపోతుంది అని అన్నారు.

హీరో నవీన్ బేతిగంటి మాట్లాడుతూ .. నేను రామన్న యూత్ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ నువ్వు డైరెక్షన్ చేస్తున్నావు కదా యాక్టింగ్ చేయవేమో అంటూ ఆఫర్స్ ఇవ్వడం మానేశారు. ఆ సమయంలో దాము అన్న ద్వారా శ్రీమాన్ వచ్చి ఈ కథ చెప్పాడు. ఈ కథలో నేను ఏ క్యారెక్టర్ కోరుకున్నానో, అదే క్యారెక్టర్ నాకు ఇచ్చారు. నా లైఫ్ టైమ్‌లో గుర్తుండే సినిమా అవుతుంది. రాక్షస కావ్యం ఒక డిఫరెంట్ మూవీ. సినిమా చూశాక మీరే చెబుతారు. శ్రీమాన్ లాంటి ప్యాషనేట్ డైెరెక్టర్ ను మనమంతా సపోర్ట్ చేయాలి. టీజర్ ఎంత బాగుందో సినిమా కూడా అంతే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది అని అన్నారు.

Is Ramanna Youth Director Naveen Bethiganti rejected Balagam Director Venu Veldandi?

బలగం దర్శకుడు వేణు మాట్లాడుతూ.. నిర్మాత దాము అన్నకు, రామన్న యూత్ సినిమాతో దర్శకుడిగా మారిన నవీన్ బేతిగంటికి ధన్యవాదాలు. నవీన్ బేతుగంటి తాను దర్శకత్వం వహించే రామన్న యూత్‌లో ఆఫర్ ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత నన్ను ఆ సినిమా నుంచి తొలగించాడు. ఏది ఏమైనా కొత్తగా ఏదైనా సినిమా చేయాలనే తపన ఉన్న టీమ్ అంతా కలిసి రాక్షస కావ్యం చేశారు. ఎదో కొత్తదనం సినిమాలో ఉండబోతోంది అని అర్థమైంది. మీకూ టీజర్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి అని అన్నారు.

అయితే బలగం వేణు చేసిన కామెంట్లకు నటుడు, దర్శకుడు నవీన్ బేతిగంటి స్పందించారు. నేను నా సినిమా రామన్న యూత్‌ నుంచి తీసివేయలేదు. నా సినిమా స్టార్ట్ అయినప్పుడు అదే సమయంలో బలగం సినిమాను వేణు ప్రారంభించాడు. ఆ సమయంలో వేణును డిస్ట్రబ్ చేయడం ఎందుకని నేను ఆ సినిమా కోసం పిలువలేదు. వేణు సరదాగా ఆ మాట చెప్పారు. నేను ఆయనను రిజెక్ట్ చేయలేదు అని నవీన్ అన్నాడు.

Is Ramanna Youth Director Naveen Bethiganti rejected Balagam Director Venu Veldandi?

నటీనటులు: నవీన్ బేతిగంటి, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి, యాదమ్మ రాజు, శివరాత్రి రాజు, ప్రవీణ్ దాచరం, కోట సందీప్, విజయ్ అంబయ్య, వినయ్ కుమార్ పర్రి తదితరులు
ఎడిటర్ అండ్ కలరిస్ట్: వెంకటేష్ కళ్యాణ్
సినిమాటోగ్రఫి: రుషి కోనాపురం
సంగీతం: రాజీవ్ రాజ్, శ్రీకాంత్
ఆర్ట్: గాంధీ నడికుడికర్
సాహిత్యం: మిట్టపల్లి సురేందర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఉమేష్ చిక్కు
సౌండ్ డిజైన్: నాగార్జున తాళ్లపల్లి
కో ప్రొడ్యూసర్స్, నవీన్ రెడ్డి, వసుంధర దేవి
పీఆర్వో: జీఎస్కె మీడియా
నిర్మాతలు: దాము రెడ్డి, శింగనమల కల్యాణ్
రచన, దర్శకత్వం: శ్రీమాన్ కీర్తి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X