»   » వర్మ నాగ్‌కు ఇచ్చిన మాట తప్పాడా?: అసలేం చేస్తున్నాడు..

వర్మ నాగ్‌కు ఇచ్చిన మాట తప్పాడా?: అసలేం చేస్తున్నాడు..

Subscribe to Filmibeat Telugu

ఇప్పటికీ బాలీవుడ్ డైరెక్టర్స్ కొంతమంది తమ ఫేవరెట్ దర్శకుల జాబితాలో వర్మ పేరును కచ్చితంగా ప్రస్తావిస్తారు. తొంభైల్లో భారతీయ సినిమాను అత్యంత ప్రభావితం చేసిన దర్శకుల్లో ఆయన కూడా ఒకరనేది జగమెరిగిన సత్యం. 'శివ'తో మొదలైన వర్మ ప్రస్థానంలో హిట్స్.. ఫట్స్.. వాటి కన్నా వివాదాలే ఎక్కువగా ఉన్నాయి. 28ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ నాగార్జునతో సినిమా చేస్తున్న వర్మ.. ఆయనకిచ్చిన కమిట్‌మెంట్ మరిచిపోయారా? అన్న ప్రశ్న ఒకటి తెరపైకి వచ్చింది.

నాగ్ మూవీలో న్యూ హీరోయిన్.. హాట్‌ ఫోటోస్ షేర్ చేసిన వర్మ!
 ఆశ్చర్యం అనిపించినా..:

ఆశ్చర్యం అనిపించినా..:

నిజానికి గత కొన్నేళ్లుగా వర్మ నుంచి సరైన సినిమా రాలేదు. కేవలం వివాదం కోసమే చేస్తున్నాడా? అన్నట్లుగా కొన్ని యథార్థ సంఘటనల నేపథ్యంలో సినిమాలు తీస్తూ వచ్చాడు. ఇలాంటి తరుణంలో నాగార్జున వర్మతో సినిమా కమిట్ అవడం చాలామందికి ఆశ్చర్యమే అనిపించింది.

 ఆ కండిషన్ తోనే..:

ఆ కండిషన్ తోనే..:

తన సినిమా చేసేటప్పుడు వేరే మరో సినిమా పని పెట్టుకోకుండా.. పూర్తిగా దానిపైనై ఫోకస్ చేయాలని నాగ్ వర్మకు కండిషన్ పెట్టాడు. ఇదే విషయాన్ని సినిమా ప్రారంభోత్సవం రోజు కూడా నాగ్ స్వయంగా వెల్లడించారు.

 నాగ్‌కు ఇచ్చిన మాట తప్పాడా?:

నాగ్‌కు ఇచ్చిన మాట తప్పాడా?:

కానీ వర్మ తీరు చూస్తుంటే నాగ్‌కు ఇచ్చిన కమిట్‌మెంట్ తప్పినట్లే అనిపిస్తోంది. నిన్న మొన్నటిదాకా నాగార్జునతో ప్రాజెక్టు పైనే ఫోకస్ చేస్తున్నట్లు కనిపించిన వర్మ.. ఇప్పుడు జీఎస్‌టీ అనే కొత్త ప్రాజెక్టుతో హల్‌చల్ చేస్తున్నాడు. గాడ్, సెక్స్&ట్రూత్ అనే ఓ షార్ట్ ఫిలిం తెరకెక్కిస్తున్నాడు.

 ఎక్కడ నాగ్ సినిమాపై ప్రభావం పడుతుందో?:

ఎక్కడ నాగ్ సినిమాపై ప్రభావం పడుతుందో?:

నాగ్‌కు కుటుంబ ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉంది. మరీ ముఖ్యంగా మహిళల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి హీరోతో సినిమా చేస్తున్న సమయంలో.. వర్మ పోర్న్ స్టార్ సినిమాతో హడావుడి చేయడమేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పోర్న్ స్టార్‌తో సినిమా గనుక తీవ్ర వివాదానికి దారితీస్తే.. ఆ ప్రభావం నాగ్ సినిమాపై పడుతుందేమోనన్న ఆందోళన అభిమానుల్లో నెలకొంది.

 వర్మ ఏం చేస్తున్నాడు:

వర్మ ఏం చేస్తున్నాడు:

నాగ్-వర్మల సినిమా నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ లోనే షూటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి సినిమాకు సంబంధించి ఏ అప్‌డేట్ లేదు. మరి వర్మ ఒకవైపు ఈ సినిమా షూట్ చేస్తూనే.. జీఎస్‌టీ పనిలో పడ్డారా?.. లేక దీన్ని పక్కనపెట్టి ఆ షూటింగ్ చేస్తున్నారా? అన్నది తెలియడం లేదు.

English summary
Director Ram Gopal Varma now shifted his focus to the bold movies, he is doing a movie with Nagarjuna and simultaneously making a bold movie GST.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X