‘హీరోయిన్’ దెబ్బకు దేవుడి దగ్గరికి వెళ్ళిన డైరెక్టర్...!?
'ఎంకి పెళ్ళి సుబ్బు చావుకొచ్చిందని" అన్నట్టు కొంతమందికి సంతోషకరమైన వార్త మరికొందరికి దుఖాన్ని కలిగిస్తుంటుంది. ఐశ్వర్య విషయంలో ఇదే జరిగింది. ఐష్ తల్లి కాబోతుందన్న విషయం ఆమె కుటుంబానికి ఆనందాన్ని పంచినా, బాలీవుడ్ దర్శక నిర్మాత మధుర్ బండార్కర్ కు షాక్ కు గురిచేసింది. తను ఎంతో కష్టపడి తయారుచేసుకున్న 'హీరోయిన్' ప్రాజెక్ట్ ఆగిపోయే స్టేజ్‌కు వచ్చింది.
ఇదే విషయాన్ని ఐశ్వర్య వద్ద ప్రస్తావించగా, పొంతనలేని సమాధానాలు చెప్పింది. దాంతో మధుర్ బండార్కర్ వేరే కథానాయికను ఎంచుకునే పనిలోపడ్డాడు. ఎంతో డెప్త్ ఉన్న క్యారెక్టర్ కావటంతో, దాన్ని తెరపై ఫర్ ఫెక్ట్ గా కనబరిచే హీరోయిన్ అయితేనే బాగుంటుందని, అదికూడా అనుభవం ఉన్నవారయితే పని తేలికవుతుందని ఆలోచించాడు.
ఈ అన్వేషణలో వారం పాటు ఆఫీస్ కూడా వెళ్ళకుండా మొహం చాటేశాడట. తర్వాత బాలీవుడ్ న్యూస్ ప్రకారం..గోల్డెన్ టెంపుల్ ను దర్శనం చేసుకుంటే సినిమాకు వచ్చిన ఆటంకాలు ఉండవని జ్యోతిష్యులు చెప్పడంతో మధుర్ బండార్కర్ 'గోల్డెన్ టెంపుల్" దర్శనం చేసుకొని వచ్చాడు. అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్"ను దర్శనం చేసుకోవడంతోనే ఆనకు ఒక మంచి ఆలోచన వచ్చిందని తెలుస్తుంది.
దర్శనం తర్వాత సరాసరి ఈ దర్శకుడు సీక్రెట్ గా కరీనా కపూర్ ను కలిసి హీరోయిన్ గా నటించమని అడగటం జరిగిందట. ఆమె అంగీకరించకపోవడంతో ఫైనల్‌గా రాణీముఖర్జీ అయితే ఎదురుదెబ్బలు తిన్నది కాబట్టి, ఈ పాత్రకు న్యాయం చేయగలుతుందని ఒక విధంగా ఐశ్వర్యకంటే రాణీయే 'హీరోయిన్'గా పర్ ఫెక్ట్ అని తేల్చాడు. నిజానికి ఎవరు ఎంతవరకు పర్ ఫెక్ట్ అనేది సినిమా మొదలెట్టిన తర్వాతే అర్ధమవుతుంది. అయితే మధుర్ దైవ దర్శనం తర్వాత ఇప్పుడు రాణీ ఏమంటుందోనని బాలీవుడ్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది.


Click it and Unblock the Notifications











