మాస్ హీరో రవితేజ భారీ చిత్రాల నిర్మాత ఎమ్మెస్ రాజు సినిమాలో చేయబోతున్నారనే వార్త పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్. గత కొంత కాలంగా వరస ఫ్లాపులను ఎదుర్కొంటున్న యమ్.యస్.రాజు ఇప్పుడు ఎలాగైనా హిట్ లు కొట్టి తన పూర్వ వైభవం తిరిగి సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే అరుదైన కాంబినేషన్ అయిన రామ్,హన్సిక లతో బి.గోపాల్ దర్శకత్వంలో 'జోష్' ప్రారంభిస్తున్నారు. అలాగే గుణ శేఖర్ దర్శకత్వంలో 'సాధు' చేయటానికి బాలకృష్ణ ను సంప్రదించారనీ తెలుస్తోంది. ఇప్పుడు 'దుబాయి శీను, కృష్ణ' ల సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న రవితేజాతో సినిమా చేయ సంకల్పించారని తెలుస్తోంది. అతని మాస్ ఇమేజ్ కి తగిన ఎంటర్ టైన్ మెంట్ కథతో సినిమాను తీయాలని స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. దర్శకుడు ఎంపిక కూడా పూర్తయిందని రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అందరూ చెప్పుకుంటున్నారు.