twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈసారి కేసీఆర్‌ను కెలికిన వర్మ.... ‘కోబ్రా’తో కాటేస్తాడా? ముఖ్యమంత్రి పాత్రలో ఎవరంటే!

    |

    డైరెక్టర్‌గా, సింగర్‌గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగా ఇప్పటికే పలు అవతారల్లో కనిపించిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు నటుడిగా మారారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నయీం జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న కోబ్రా చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. అయితే వివాదం లేకుండా తన చిత్రాలను నిర్మించలేని బలహీనత ఉండే వర్మ.. తాజాగా కోబ్రాలో సీఎం కేసీఆర్‌ను పాత్రను కూడా తెరపైకి తెస్తున్నారు. ఆ విషయాన్ని ఫస్ట్‌లుక్‌లోనే వెల్లడించారు. అయితే కేసీఆర్‌ను ఈ సినిమాలో ఏ విధంగా చూపబోతున్నారనే ప్రశ్నపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

     కోబ్రా స్టోరీ ఇదే

    కోబ్రా స్టోరీ ఇదే

    ఓ రౌడీ షీటర్, ఓ నక్సలైట్‌గా మారి ఆ తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా, పోలీసు కోవర్టుగా మారిన జీవిత కథ ఇది. దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్ మాదిరిగా నేర సామ్రాజ్యానికి బ్రాండ్‌గా మార్చాడు. అతను చనిపోయేంత వరకు కోబ్రా ఎవరో తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా మాఫియా కార్యక్రమాలు నిర్వహించారు అని వర్మ ఇటీవల ట్విట్టర్‌లో కథ గురించి వివరణ ఇచ్చారు.

     పవర్‌పుల్ డైలాగ్స్‌తో కోబ్రా

    పవర్‌పుల్ డైలాగ్స్‌తో కోబ్రా

    అతడిని అరెస్ట్ చేస్తే.. సంగం పోలీసు డిపార్ట్‌మెంట్ జైల్లోనే ఉంచాలి అనే క్యాప్షన్‌తో.. శత్రువును చంపడానికి త్రాచు పామును చేరదీస్తే.. ఎప్పుడో ఒకప్పుడు మనల్ని కూడా కాటేస్తుంది అని డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని రేపాడు. సినిమా ఎలా బోతుందో అనే విషయాన్ని వెల్లడించారు.

    నయీం కేసు నీరుగారుస్తాడా? అనే

    నయీం కేసు నీరుగారుస్తాడా? అనే

    దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన క్రిమినల్ నయీం కేసులో పలు రాజకీయ పార్టీల నేతల పేర్లు బయటకు వినిపించాయి. పలు వారాలు నయీం అకృత్యాలను సీరియల్‌గా కథనాలను ప్రచురించినప్పటికీ కేసును నీరు గార్చారనే వాదన బలంగా వినిపించింది. అధికార పార్టీ నేతలే ఉండటం అందుకు కారణమని మాట కూడా వైరల్ అయింది.

    సీఎం కేసీఆర్ పాత్రలో

    సీఎం కేసీఆర్ పాత్రలో

    ఇక ఫస్టులుక్‌లో క్రిమినల్‌గా కేజీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌గా రంగారావు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా రాంగోపాల్ వర్మ అంటూ కీలక నటుల పేర్లను పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పేరు, క్రిమినల్ పేరును చెప్పడానికి ఇష్టపడని వర్మ.. కేసీఆర్ పేరును ప్రచారం కోసం వాడుకొన్నారు. అయితే ఈ రంగారావు ఎవరు అనే అంశంపై ఆసక్తి పెరుగుతున్నది.

    నిన్న చంద్రబాబు.. నేను టార్గెట్ కేసీఆర్..

    నిన్న చంద్రబాబు.. నేను టార్గెట్ కేసీఆర్..

    లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో ఏపీ సీఎం చంద్రబాబును ఆడుకొన్న వర్మ.. ఈసారి కేసీఆర్‌ను టార్గెట్ చేయబోతున్నాడా అనే అనుమానం రేకెత్తుతున్నది. ఈ నేపథ్యంలో కోబ్రాలో కేసీఆర్ పాత్ర ఎలా ఉండబోతుంది. సానుకూలంగా ఉంటుందా? అలవాటు ప్రకారం ఆ పాత్రను కెలుకుతారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో శక్తిమంతమైన లీడర్‌గా కనిపిస్తున్న కేసీఆర్‌ను ఎవరూ కెలికిన దాఖలాలు లేవు. ఈ సారి ఆ సాహసం వర్మ చేసే పరిస్థితుల్లో ఉన్నాడా అనే అనుమానం కలుగుతున్నది.

    English summary
    RGV tweeted that COBRA is a biopic of a rowdy sheeter turned naxalite turned Police covert agent turned gangster ..While the likes of Dawood Ibrahims and Chota Rajans ruled the criminal world on brand names, the Cobra ruled in anonymity ..No one knew of his existence till he died.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X