రజనీ 'రోబో'...ఉపేంద్ర కన్నడ చిత్రం కాపీనా?

By Srikanya

అక్టోబర్ మొదటి తేదీన రిలీజ్ కానున్న "రోబో" పై తాజాగా కాపీ దుమారం రేగింది. ఈ చిత్రం ఉపేంద్ర నటన, రచన చేసిన 2002 నాటి సైన్స్ ఫిక్షన్ "హాలీవుడ్" (చిత్రం టైటిల్) కు ప్రీమేక్ ప్రచారం మొదలైంది. ఆ కన్నడ చిత్రం నుంచి స్టోరీ లైన్ తీసుకుని డవలప్ చేసారంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక "హాలీవుడ్" చిత్రం కథ విషయానికి వస్తే...ఉపేంద్ర ఓ సైంటిస్ట్(అనంత్ నాగ్) కు అసెస్టెంట్ గా పనిచేస్తూంటాడు. ఆ సైంటిస్టు...ఉపేంద్ర పోలికలతో ఉండే ఓ రోబో ను తయారు చేస్తాడు. తన ప్రేమను సహాయంగా ఉండమని ఆ రోబోను కోరుతాడు. అయితే ఆ అమ్మాయి..ఉపేంద్ర సోదరుడు(మళ్లీ ఉపేంద్ర) తో ప్రేమలో పడి ఉంటుంది. అయితే ఇక్కడ ట్విస్టు ఏమిటంటే..ఆ రోబో వెళ్ళి ఆ అమ్మాయితో ప్రేమలో పడి...ఆ అమ్మాయి ప్రేమించే ఉపేంద్రను చంపేసే ప్రయత్నం చేస్తుంది.

ఇక రోబో కథలోనూ..రజనీకాంత్ ..రోబో గానూ,సైంటిస్టుగానూ ద్విపాత్రాభినయం చేయటం మొదటి పోలికగా చెప్తున్నారు. అలాగే తాజాగా రజనీకాంత్ ఈ చిత్రంలో మూడు పాత్రలు చేసారని వినిపిస్తోంది. ఈ అంశం కూడా ఉపేంద్ర సినిమాని పోలి ఉంది.ఇక రోబో వెళ్ళి..సైంటిస్ట్ హీరో ప్రేమించే..అమ్మాయి ఐశ్వర్యారాయ్ తో ప్రేమలో పడుతుంది. ఇక హాలీవుడ్ లో ఓ కోతి ఆసక్తి కరమైన పాత్రలో నటించింది. రోబో లో ఓ దోమ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ఇక ఈ కాపీ విషయమై ఉపేంద్ర "హాలీవుడ్" చిత్రాన్ని డైరక్ట్ చేసిన దినేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ..నేను రోబోకు,నా చిత్రాల మధ్య పోలిక గురించి ఇఫ్పుడు కామెంట్ చేయలేను. ఎందుకంటే నేను ఇంకా రోబోను చూడలేదు. అయితే నా సన్నిహితులు, పరిచయస్తులు నాతో నా చిత్రం కథకూ రోబో కథకూ దగ్గర పోలీకలున్నాయని చెప్తున్నారు. అదే నిజమైతే నా అంత సంతోషించేవారు మరొకరు ఉండరు. అప్పుడు అది కాస్టలీ.. "హాలీవుడ్" అవుతుంది. నిజానికి మా చిత్రం చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందించాం అన్నారు. ఇంతకీ ఏ విషయం తెలియాలంటే అక్టోబర్ ఒకటవ తేదీ వరకూ వేచి ఉండాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X