For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పెళ్లికాకుండానే తల్లి కాబోతున్న RRR హీరోయిన్‌.. రాజమౌళికి మరో షాక్

  |

  తల్లి కావడానికి పెళ్లి తప్పనసరి అనే సత్యాన్ని సినీ తారలు వదలేసినట్టే కనిపిస్తున్నది. ప్రస్తుత జనరేషన్‌లో సహజీవనమే యువ తారలకు శరణ్యంగా కనిపిస్తున్నది. తాజాగా ఎమ్మా రాబర్ట్స్ పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నది. తన ప్రియుడు గెర్రెట్ హెడ్‌లుడ్‌తో కలిసి తొలి సంతానానికి సిద్ధమైంది. అయితే ఎమ్మారాబర్ట్స్ ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు.. కానీ ఆమె తల్లి మాత్రం అధికారికంగా ప్రకటించారు. వివరాల్లోకి వెళితే..

  RRR చిత్రంలో ఎన్టీఆర్ సరసన

  RRR చిత్రంలో ఎన్టీఆర్ సరసన

  ఎమ్మా రాబర్ట్స్‌ విషయానికి వస్తే.. ఈ సుందరి పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎలా అంటే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించే RRR మూవీలో ఎమ్మా రాబర్ట్స్‌ను ఎన్టీఆర్‌కు జోడిగా నటింప జేసేందుకు ప్రయత్నాలు జరిగాయనే విషయంపై గత జూలైలో భారీగా కథనాలు మీడియాలో కనిపించాయి. అయితే చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి వివరణ రాకపోవడంతో ఆ వార్త గాసిప్‌గానే మిగిలిపోయింది.

  డైసీ ఎడ్గర్ జోన్స్ స్థానంలో

  డైసీ ఎడ్గర్ జోన్స్ స్థానంలో

  RRR విషయానికి వస్తే.. కథా డిమాండ్ మేరకు ఎన్టీఆర్‌కు ప్రియురాలిగా ఓ బ్రిటన్‌ యువతి పాత్ర ఉంది. ఆ పాత్ర కోసం మొదట్లో బ్రిటన్ యాక్టర్ డైసీ ఎడ్గర్ జోన్స్‌ను రాజమౌళి తీసుకొన్నారు. అయితే ఆమె షూటింగు కొద్దిరోజుల్లో ప్రారంభమవుతుందనే సమయంలో సినిమా నుంచి తప్పుకొన్నారు. దాంతో జూలియా రాబర్ట్స్ మేన కోడలు ఎమ్మా రాబర్ట్స్‌తో చర్చలు జరిపారు. ఆ వార్త గతేడాది మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

  నా కూతురు ప్రెగ్నెంట్

  నా కూతురు ప్రెగ్నెంట్

  ఇక ఎమ్మా రాబర్ట్స్ ప్రెగ్నెన్సీ విషయానికి వస్తే.. ఆమె తల్లి కెల్లీ కన్నిగ్హం తన కూతురు గర్బంపై క్లారిటీ ఇచ్చారు. ఎమ్మా రాబర్ట్స్ గర్బవతి అనే వార్త వాస్తవమే అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఎమ్మా వాట్సన్ ప్రెగ్నెంట్. నేను మంచి అమ్మమ్మను కాబోతున్నాను. ఈ వార్తను తెలియజేయడానికి చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను అని కెల్లీ చెప్పారు. ఇలా పోస్టు పెట్టిన ఆమె వెంటనే ఇన్స్‌టాగ్రామ్ నుంచి తొలగించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

  కొద్ది వారాల ప్రేమ మాత్రమే

  కొద్ది వారాల ప్రేమ మాత్రమే

  ఎమ్మా రాబర్ట్స్ ప్రేమ వ్యవహారంపై అమెరికాకు చెందిన పాపులర్ వెబ్‌సైట్ ఓ కథనాన్ని ప్రచురించింది. గ్యారెట్, ఎమ్మా ప్రేమ కథ ఇప్పుడే మొదలైంది. కొన్ని వారాలుగా వారిద్దరూ అఫైర్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోనవసరం లేదు. ఇది జస్ట్ క్యాజువల్ అంటూ వెబ్‌సైట్ తన కథనంలో పేర్కొన్నది.

  నా లైఫ్ గురించి మీకెందుకు

  నా లైఫ్ గురించి మీకెందుకు

  తన లవ్ లైఫ్ గురించి ఎమ్మా రాబర్ట్స్ తన ప్రేమ గురించి తాజా ఇంటర్వ్యూలో వెల్లడిస్తూ.. నేను ఎవరితో.. ఏలా ఉన్నాను?.. ఏమి చేస్తున్నాను? ప్రపంచంలో ఎవరితో ఎక్కడ ఉన్నాను అనే విషయాలకు సమాధానాలకు చెప్పడం చాలా కష్టమే. నా జీవితంలో ఎగుడు దిగుళ్లు ఉంటాయనే విషయాన్ని గ్రహించాను. అలాంటి వాటిని పట్టించుకోనవసరం లేదు అనే విషయాన్ని వివరించారు.

  Bollywood Nepotism : RRR లో ఆలియా భట్ వద్దు అంటున్న Sushant Singh Rajput ఫ్యాన్స్
   రాజమౌళికి కొత్త తలనొప్పి

  రాజమౌళికి కొత్త తలనొప్పి

  ఒకవేళ RRRలో జూనియర్ ఎన్టీఆర్‌తో ఎమ్మా రాబర్ట్స్ నటించడం నిజమైతే రాజమౌళికి మరో కొత్త తలనొప్పి వచ్చినట్టే. ఎందుకంటే ప్రెగ్నెన్సీతో ఉన్న హీరోయిన్‌ను ఇప్పుడున్న పరిస్థితుల్లో సెట్స్‌లో మేనేజ్ చేయడం కష్టమే. ఒకవేళ RRR ఎమ్మా రాబర్ట్స్ నటిస్తే ఆమెను తీసుకొంటారా? అనేది ప్రశ్నగా మారింది. ఒకవేళ ఆమెను ఈ సినిమా నుంచి తప్పిస్తే మూడోసారి ఎన్టీఆర్ హీరోయిన్ కోసం వెతుకులాట మొదలుపెట్టాల్సి వస్తుందనే అనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.

  English summary
  RRR's Heroine Emma Roberts pregnancy news goes viral in world film media. Her mother Kelly Cunningham confirms Emma Roberts's pregnancy. This news is hot topic in world media including Indian press.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X