సాహో ఫస్ట్ లుక్ పోస్టర్ హాలీవుడ్ మూవీకి కాపీనా? ఫొటోలు వైరల్
Recommended Video

బాహుబలి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వా త ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. అక్టోబర్ 23వ తేదీన యంగ్ రెబల్‌స్టార్ బర్త్ డే పురస్కరించుకొని సాహో చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. అయితే అభిమానులు విశేషంగా ఆకట్టుకొంటున్న ఈ ఫస్ట్ లుక్ ఓ హాలీవుడ్ సినిమా పోస్టర్‌ను కాపీ కొట్టారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది.

బ్లేడ్ రన్నర్ పోస్టర్‌కు కాపీనా?
తాజాగా రిలీజ్ అయిన సాహో ఫస్ట్ లుక్ పోస్టర్ బ్లేడ్ రన్నర్ చిత్రం నుంచి కాపీ కొట్టారు అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతున్నది. అందుకు సాక్ష్యంగా నిలిచిన బ్లేడ్ రన్నర్ పోస్టర్‌ను పోస్ట్ చేశారు.

సాహో, బ్లేడ్ రన్నర్ పోస్టర్లు ఒకటేనా
బ్రేడ్ రన్నర్ చిత్రంలో మాదిరిగానే హీరో నల్లటి కోట్ వేసుకొని వచ్చే సన్నివేశం తాజాగా రిలీజ్ చేసిన సాహో పోస్టర్‌ను పోలి ఉండటంతో కాపీ అనడానికి బలమైన నమ్మకం కలిగింది.

పునర్జన్మ కథాంశంతో సాహో
ఇదిలా ఉండగా, సాహో చిత్రం కథ పునర్జన కథాంశంతో రూపుదిద్దుకుంటున్నట్టు సమాచారం. ఈ చిత్రం స్వాతంత్రానికి పూర్వం, ఆ తర్వాత అంశాలు ఈ కథలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది.

బ్రిటీష్ నాటి స్టోరీతో
తొలి షెడ్యూల్‌లో బ్రిటీష్ నాటి పరిస్థితులు ప్రతిబింబించేలా సెట్స్‌ను వేసినట్టు ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. ఇటీవల గుర్రాలు, బ్రిటిష్ జెండాలు సెట్లో ఉపయోగించినట్టు చిత్ర యూనిట్ పేర్కొన్నది.


Click it and Unblock the Notifications











