NTR30 జూనియర్ ఎన్టీఆర్‌కు షాకిచ్చిన సైఫ్ ఆలీఖాన్.. అసలేం జరిగిందంటే?
RRR సినిమా తర్వాత ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన అభిమానుల కోసం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తియ్యని వార్త చెప్పారు. చాలా నెలలుగా కొరటాల శివతో ప్రాజెక్టు పట్టాలెక్కుతుందా అనే అనుమానాల మధ్య ఎన్టీఆర్ తన సినిమాకు ముహుర్తం పెట్టారు. నిరాడంబరంగా ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. అయితే పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్‌కు గట్టి షాకే తగిలినట్టు ఓ వార్త మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ నేపథ్యంలో కొరటాల శివతో సినిమా, ఎన్టీఆర్‌కు షాకిచ్చిన బాలీవుడ్ హీరో వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
రాంచరణ్ జోష్‌తో రెండు సినిమాలు : RRR సినిమా షూటింగ్ సమయంలోను, అలాగే ఆ సినిమా రిలీజైన తర్వాత మెగా పవర్‌స్టార్ రాంచరణ్ వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిపోయారు. RRR రిలీజ్ కాగానే ఆచార్య సినిమాతో రాంచరణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత శంకర్‌తో పాన్ ఇండియా సినిమాను మొదలుపెట్టి పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ వెనుకపడినట్టు : అయితే ఎన్టీఆర్ మాత్రం తన సినిమాను ప్రారంభించడంలో కాస్త వెనుక పడ్డినట్టు కనిపించారు. దాంతో ఓ దశలో అభిమానుల్లో అసంతృప్తి పెరిగిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ కనిపిస్తే అక్కడ సినిమా ఎప్పుడూ అని సుమ లాంటి యాంకర్లతోపాటు అభిమానులు వెంటపడ్డారు. సినిమా ఎప్పుడు మొదలుపెడుతున్నారనే విషయాన్ని పదే పదే అడగడంతో ఎన్టీఆర్ అభిమానులపై చిరాకు పడటం తెలిసిందే.
జాన్వీ, సైఫ్ ఆలీ ఖాన్‌తో NTR30 : ఇలాంటి అసంతృప్తుల మధ్య కొరటాల శివ కాంబినేషన్‌లో ఎన్టీఆర్ తన సినిమాను ప్రారంభించారు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ప్రాజెక్టులోకి తీసుకొచ్చి అభిమానుల్లో ఉన్న సంతృప్తిని కాస్త దూరం చేశారు. అంతేకాకుండా బాలీవుడ్ నుంచి స్టార్ హీరో సైఫ్ ఆలీ ఖాన్‌ను కూడా ప్రాజెక్టులోకి తీసుకొచ్చి మరింత క్రేజ్‌గా మార్చారు. దాంతో ఈ సినిమాపై మరింత సానుకూలత పెరిగింది.
ఎన్టీఆర్ మూవీలో సినిమా రిజెక్ట్ చేసిన సైఫ్ : అయితే సైఫ్ ఆలీ ఖాన్ లాంటి హీరోను విలన్‌గా మార్చిన జూనియర్ ఎన్టీఆర్‌కు ఆ ఆనందం ఎక్కువ సేపు ఉండలేదు. తాజా సమాచారం ప్రకారం.. కొరటాల శివ, ఎన్టీఆర్ ప్రాజెక్టు నుంచి సైఫ్ ఆలీ ఖాన్ తప్పుకొన్నట్టు తెలిసింది. దాంతో కొరటాల, ఎన్టీఆర్ టీమ్ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ప్రస్తుతం సైఫ్ ఆలీ ఖాన్ స్థానంలో మరో నటుడి కోసం వెతికే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది.

విలన్ పాత్రలతో సైఫ్ ఆలీ ఖాన్ : సైఫ్ ఆలీ ఖాన్ విషయానికి వస్తే.. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలో రావణాసురుడిగా నటించారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. గతంలో కూడా బాలీవుడ్‌లో విలన్ వేషాలు వేసి మెప్పించిన విషయం తెలిసిందే. గతంలో ఓంకార, తానాజీ లాంటి సినిమాల్లో పవర్‌ఫుల్ విలన్‌గా మెప్పించడం అప్పట్లో విశేషంగా మారింది.


Click it and Unblock the Notifications











