Samantha Ruth Prabhu కు మళ్లీ తీవ్ర అనారోగ్యం.. శాకుంతలం ప్రమోషన్స్‌కు దూరం!

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు ప్రధాన పాత్రలో సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో దిల్ రాజు, నీలిమ గుణ నిర్మించిన చిత్రం శాకుంతలం. అభిజ్ఞాన శాకుతలం గ్రంథం ఆధారంగా రూపొందిన ఈ సినిమా టీజర్, ట్రైలర్లు మంచి అంచనాలు పెంచాయి. పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అవుతన్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న సమంత రుత్ ప్రభు మరోసారి అనారోగ్యానికి గురైందనే విషయాన్ని దర్శకుడు గుణశేఖర్ వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే..

అరుదైన వ్యాధికి గురైన సమంత సమంత ఇటీవల కాలంలో మయోసిటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన విషయం తెలిసిందే. యశోద సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు ముందు ఆమె తీవ్ర అనారోగ్యానికి గురి కావడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ఆ సమయంలో యశోద సినిమా ప్రమోషన్స్ దాదాపు దూరమయ్యారు. ఆ తర్వాత కోలుకొని ఇప్పుడిప్పుడే షూటింగులో పాల్గొంటున్నారు.

Samantha Ruth Prabhu

శాకుంతలం ప్రమోషన్స్‌లో : సమంత తాను నటించిన శాకుతలం సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు సిద్దమైంది. ఇటీవల ఉత్తరాదిలో పలు నగరాల్లో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే ఇటీవల ఎల్బీ స్టేడియంలో చాలా మంది పాల్గొన్న కార్యక్రమంలో 40 నిమిషాలు పాల్గొన్నారు. అలాగే తెలుగు మీడియా ఇంటరాక్షన్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో స్వల్ప అనారోగ్యంతో ఉన్నారు.

సమంతకు మళ్లీ అనారోగ్యం : శాకుంతలం సినిమా ప్రమోషన్స్‌లో సమంత రెగ్యులర్‌గా పాల్గొంటున్నారు. అయితే ఇటీవల 30 వేల మంది పాల్గొన్న ఓ సభలో ఆమె పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమె అనారోగ్యానికి గురైంది. ప్రమోషన్స్ రావొద్దని ఆమెను కోరాం. కానీ నేను నటించిన సినిమాను ప్రమోషన్స్ చేస్తానంటూ ఆమె వచ్చింది. ఆ తర్వాత ఆమె తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు అని గుణశేఖర్ తెలిపారు.

బీజేపీ పెద్దలకు శాకుంతలం సినిమా : ఢిల్లీలో బీజేపీ, ఆరెస్సెస్ పెద్దలకు శాకుంతలం సినిమాను బుధవారం (ఏప్రిల్ 12వ తేదీన) ప్రదర్శిస్తున్నాం. ఈ ప్రదర్శనకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్నారు. రాజ్ నాథ్ సింగ్ వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ ప్రీమియర్‌కు సమంత కూడా వెళ్లాల్సింది. కానీ అనారోగ్యం కారణంగా వెళ్లలేదు. వైద్యులు ఆమెకు కొన్ని రోజులు రెస్ట్ కావాలని సూచించారు అని గుణశేఖర్ చెప్పారు.

Samantha Ruth Prabhu

ప్రీమియర్లు రద్దు ఎందుకంటే? : సమంత వెళ్లకపోయినా నిర్మాత దిల్ రాజు వెళ్లడం వల్ల ఢిల్లీలో ప్రీమియర్ వేస్తున్నాం. సమంత ఉంటే ఆ ప్రీమియర్ మరోలా ఉండేది. ఆమె లేకపోవడం వల్ల మరోలా మారింది. హైదరాబాద్‌, గుంటూరు, వైజాగ్‌లో ప్రీమియర్లు వేయాల్సి ఉంది. కానీ 3డీ వెర్షన్‌లో కొన్ని సాంకేతికపరమైన లోపాలు ఉన్నాయి. వాటిని రెక్టిఫై చేశాం. ఆ కారణంగా మంగళ, బుధవారం షోలు క్యాన్సిల్ అయ్యాయి. గురువారం ప్రీమియర్ వేస్తున్నాం అని గుణశేఖర్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X