‘Samantha Ruth Prabhu స్టార్ డమ్ ఖతం.. శాకుంతలం డిజాస్టర్ తర్వాత స్టార్ హీరోయిన్ కాదు’

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. దర్శకుడు గుణశేఖర్, నిర్మాత దిల్ రాజు కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు ధీటుగా లేకపోవడంతో ఈ సినిమా తొలివారాంతంలోనే భారీ పరాజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో సమంత గురించి ఓ సినీ ప్రముఖుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆ వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..

వ్యక్తిగత సమస్యలతో సమంత: సమంత రుత్ ప్రభు ఇటీవల కాలంలో రకరకాల వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్నారు. భర్త నాగచైతన్యతో విడాకులు, ఆ షాక్ నుంచి తేరుకోకముందే.. ఆమె అరుదైన వ్యాధి మయోసిటిస్ గురి కావడం తెలిసిందే. అయితే ఆ వ్యాధి నుంచి తేరుకొని మళ్లీ కెరీర్‌పై దృష్టిపెట్టింది. ఈ క్రమంలో వచ్చిన శాకుంతలం మూవీ నిరాశకు గురిచేసింది. దాంతో కొన్ని వర్గాల నుంచి దారుణమైన విమర్శలు రావడం చర్చనీయాంశమయ్యాయి.

samantha Ruth Prabhu

సమంత సింపతీ అంటూ : తెలుగు సినిమా రంగంలో ప్రముఖుడు చిట్టిబాబు మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఆరోగ్యం బాగా లేదని సింపతీ కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నది. సినిమా రిలీజ్ ముందు తన అనారోగ్యం గురించి రకరకాలుగా మాట్లాడుతూ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నది. అలాంటి ట్రిక్స్ పనికిరావని శాకుంతలం సినిమా రిజల్ట్ ప్రూవ్ చేసింది అని అన్నారు.

అవకాశాలు తగ్గిపోవడం వల్లే ఐటెమ్ సాంగ్స్ : భర్తతో విడాకుల తర్వాత తన జీవితాన్ని చక్క బెట్టుకొనేందుకు పుష్ప చిత్రంలో ఊ అంటావా అనే ఐటెమ్ సాంగ్ చేసింది. ఆమె స్టార్ హీరోయిన్ స్టేటస్ పోయిన తర్వాత.. ఎలాంటి ఆఫర్లు వస్తే అలాంటి ఆఫర్లను డబ్బు కోసం స్వీకరిస్తున్నది. ఇక సినీ జీవితం ముగిసిపోయింది. మళ్లీ స్టార్‌డమ్‌ను తిరిగి తెచ్చుకోవడం కష్టమే. ఇక ఆమె ముందుకు ఎలాంటి ఆఫర్లు వస్తే అలాంటి సినిమాలు చేయాలి అని చిట్టి బాబు చెప్పారు.

samantha Ruth Prabhu

సెంటిమెంట్ వర్కవుట్ కాలేదు : యశోద సమయంలో నా ఆరోగ్యం బాగాలేదని కంటతడి పెట్టుకొన్నది. మళ్లీ శాకుంతలం సినిమా రిలీజ్ సమయంలో కూడా ప్లాన్ చేసింది. కానీ ఆ సింపతి ప్లాన్ వర్కవుట్ కాలేదు. తన ఆరోగ్యం బాగాలేదని, నోటి నుంచి మాట రావడం లేదని సమంత ప్రెస్ మీట్‌లో చెప్పింది. ప్రతీసారి అలాంటి సెంటిమెంట్ పనికి రాదు. సినిమా బాగుంటే ప్రేక్షకుల చూస్తారు అని ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X