For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  CM KCR పై శేఖర్ కమ్ముల సెటైర్?.. లవ్ స్టోరీ ట్రైలర్‌లో వైరల్‌గా డైలాగ్! అసలు విషయం ఏమిటంటే?

  |

  సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరి చిత్రం ఎట్టకేలకు థియేటర్లలో రిలీజై ప్రేక్షకుల ముందకు వచ్చేందుకు ముస్తాబవుతున్నది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే కరోనావైరస్ పరిస్థితులు, లాక్‌డౌన్, థియేటర్ల మూసివేత లాంటి అంశాలు ఈ సినిమా రిలీజ్‌కు అడ్డం పడ్డాయి. అయితే ఎట్టకేలకు లవ్ స్టోరి చిత్రం సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రిలీజై థియేట్రికల్ ట్రైలర్‌లో కొన్ని సంభాషణలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. ఆ సంభాషణలు ఏమిటంటే..

  Paata Uttej: నా భవిష్యత్తు ఇలా వదిలేశావ్ ఏంటమ్మా.. కన్నీళ్లు తెప్పిస్తున్న ఉత్తేజ్ కూతురి పోస్ట్

  దక్కన్ నేటివిటితో శేఖర్ కమ్ముల సినిమాలు

  దక్కన్ నేటివిటితో శేఖర్ కమ్ముల సినిమాలు

  దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా విషయానికి వస్తే.. సమాజం, కుటుంబ వ్యవస్థలలోని సున్నితమైన అంశాలను ఆధారంగా చేసుకొని భావోద్వేగమైన అంశాలను జోడించి చిత్రాలను రూపొందించిన దాఖలాలు ఉన్నాయి. ఆయన విజన్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టాయి. ఇక దక్కన్ ప్రాంతంలోని నేటివిటిని జొప్పించి సినిమాను అన్నీ ప్రాంతాల వాళ్లు ఇష్టపడేలా తెరక్కెక్కించడం తెలిసిందే.

  అంతకుమించి అనేలా హాట్ లుక్స్ తో కవ్విస్తున్న అరియానా గ్లోరీ.. లేటెస్ట్ ఫొటోస్

  మరోసారి తెలంగాణ నేపథ్యంతో

  మరోసారి తెలంగాణ నేపథ్యంతో

  ఇక ఫిదా తర్వాత లవ్ స్టోరి చిత్రాన్ని తెలంగాణ ప్రాంత నేపథ్యం, భాష, కట్టుబాట్ల నేపథ్యంతో తెరకెక్కించినట్టు కనిపిస్తున్నది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌లో అలాంటి అంశాలు చక్కగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్‌లో డైలాగ్స్, విజువల్స్ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. నాగచైతన్య, సాయిపల్లవి మధ్య కెమిస్ట్రీ బ్రహ్మండంగా కనిపిస్తున్నది.

  లవ్ స్టోరీ ట్రైలర్‌‌కు 5 మిలియన్ల వ్యూస్

  లవ్ స్టోరీ ట్రైలర్‌‌కు 5 మిలియన్ల వ్యూస్

  మానవ సంబంధాలు, మధ్య తరగతి కుటుంబాల భావోద్వేగాలతో రూపొందించిన లవ్ స్టోరి విశేషంగా ఆకట్టుకొంటున్నది. విడుదలైన కొన్ని గంటల్లోనే లవ్ స్టోరి ట్రైలర్ ఐదు మిలియన్లకుపైగా లైక్స్ సాధించింది. దాంతో ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రేక్షకులు చెప్పకనే చెప్పారు. ఈ సినిమాలోని పాటలు కూడా అద్భుతమైన రెస్సాన్స్‌తో రికార్డు వ్యూస్‌ను సాధించడం విశేషంగా మారింది.

  గోర్లోడికి గొర్రెలు ఇస్తే అంటూ

  గోర్లోడికి గొర్రెలు ఇస్తే అంటూ

  అయితే ట్రైలర్‌లో శేఖర్ కమ్ములు పేల్చిన డైలాగ్స్ వివాదాస్పదంగా మారాయి. ట్రైలర్‌‌లో నాగచైతన్యతో ‘రిక్షావోడికి కొత్త రిక్షా ఇస్తే రిక్షానే తొక్కుతాడు, గొర్లోడికి గొర్రెలు ఇస్తే గొర్లే మేపుతాడు.. ఇంకేం డెవలప్ ఐతారు సార్...' అని చెప్పించిన డైలాగ్స్ చర్చనీయాంశమయ్యాయి. ఈ డైలాగ్‌పై సోషల్ మీడియా, యూట్యూబ్‌లో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

  సీఎం కేసీఆర్ కోసమే చెప్పినట్టు

  సీఎం కేసీఆర్ కోసమే చెప్పినట్టు

  లవ్ స్టోరి ట్రైలర్ రిలీజ్ తర్వాత సోష్ మీడియాలో రిక్షావోడికి కొత్త రిక్షా ఇస్తే రిక్షానే తొక్కుతాడు, గొర్లోడికి గొర్రెలు ఇస్తే గొర్లే మేపుతాడు.. ఇంకేం డెవలప్ ఐతారు సార్... అనే డైలాగ్‌ను ఉద్దేశించి ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. ఇది సీఎం కేసీఆర్ కోసమే చెప్పినట్టు ఉంది అని అన్నాడు. అలాగే శేఖర్ కమ్ముల డైలాగ్స్ బాగున్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు.

  Love Story రొమాంటిక్ మూవీ కాదు.. Naga Chaitanya, Sai Pallavi ల గీతాంజలి || Filmibeat Telugu
  కేసీఆర్‌కు నాగచైతన్య డైరెక్టుగా

  కేసీఆర్‌కు నాగచైతన్య డైరెక్టుగా

  సమాజంలో పేదరికం పోవాలంటే అలాంటి పథకాలు పనిచేయవు. ముందు ఈ వ్యవస్థ నుంచి కుల వ్యవస్థను రూపుమాపాలి. శేఖర్ కమ్ముల డైలాగ్ చాలా ఆలోచించింప చేసే విధంగా ఉంది అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే.. నాకు కూడా ఆ డైలాగ్ వినగానే.. ముందు కేసీఆర్ గుర్తుకు వచ్చారు. నాగచైతన్య కేసీఆర్‌కు డైరెక్టుగా చెప్పినట్టు ఉన్నదనే విషయాన్ని నెటిజన్ ప్రస్తావించారు. అయితే సినిమా చూస్తే గానీ.. శేఖర్ కమ్ముల మర్మం ఏమిటో అర్దం అవుతుందో అనే విషయాన్ని వేచి చూడాల్సిందే.

  English summary
  Naga Chaitanya and Sai Pallavi's Love Story trailer get huge response. Some of these dailogues become debatable in Social media. Reports Suggest that Shekhar Kammula made satire on KCR's Welfare Scheme.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X