విదేశీ ప్రియుడితో మరింత హాట్‌గా సుహానా ఖాన్.. షారుక్ ఖాన్ కూతురు లవ్‌లో అంటూ..

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ వెండితెర మీదకు రాకుండానే సోషల్ మీడియాలో రకరకాల లీలలను ప్రదర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా కనిపిస్తుండటమే కాకుండా.. అలాగే ఫ్రెండ్స్‌తో పార్టీలు, షికార్లతో హోరెత్తిస్తుంటారు. తాజాగా తన ప్రియుడిని పరిచయం చేస్తూ సుహానా ఖాన్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టగా అది వైరల్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే..

నా కూతురుకు అలాంటి కోరిక

నా కూతురుకు అలాంటి కోరిక

షారుక్ ఖాన్ తన కూతురు గురించి వెల్లడిస్తూ.. సుహానాకు యాక్టర్ కావాలన్నది కోరిక. కేవలం కోరిక మాత్రమే కాదు ఆమెలో ఆ పట్టుదల ఉంది. నాటకరంగంలో ఆమె బాగా రాణిస్తున్నారు. ఆమెకు సంబంధించిన ప్రదర్శనలను చూశాను. సినిమా అంటే ఒకరకమైన పిచ్చి. సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలని అనుకొంటున్నది అని షారుక్ ఖాన్ చెప్పారు.

అమెరికాలో ఉన్నత విద్య కోసం

అమెరికాలో ఉన్నత విద్య కోసం

ఉన్నత విద్య కోసం వెళ్లిన షారుక్ ఖాన్ కూతురు ముంబైలోనే కాదు.. అమెరికాలో కూడా సెలబ్రిటీ స్టేటస్‌ను సంపాదించుకొన్నారు. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన ఆమె చదువుతోపాటు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. స్నేహితులతో పార్టీలు చేసుకొంటూ వాటిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్‌డేట్ చేస్తుంటారు.

ఇటీవలే గ్రాండ్‌గా బర్త్ డే

ఇటీవలే గ్రాండ్‌గా బర్త్ డే

అమెరికాలోని న్యూయార్క్‌లో ఇటీవలే సుహానా ఖాన్ తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకొన్నారు. న్యూయార్క్‌లో తన స్నేహితులతో కలిసి జన్మదినాన్ని ఘనంగా జరుపుకొన్నారు. న్యూయార్క్‌ సిటీలోని డౌన్‌టౌన్ రెస్టారెంట్‌లో జరిగిన ఆ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను ఇటీవల ఇన్స్‌టాగ్రామ్‌లో అప్‌డేట్ చేశారు. ఆ ఫోటోపై బాలీవుడ్ సెలబ్రిటీలు కామెంట్లు చేస్తూ లైకులు కొట్టారు.

ఫ్యాన్ పేజ్‌లో ప్రియుడితో ఫోటో

ఫ్యాన్ పేజ్‌లో ప్రియుడితో ఫోటో

ఇలా తన జీవితాన్ని ఆస్వాదిస్తున్న సుహానా ఖాన్ తాజాగా ప్రేమలో పడినట్టు ఆమెకు సంబంధించిన ఫ్యాన్ పేజ్ స్పష్టం చేసింది. తన ప్రియుడితో కలిసి ఉన్న ఫోటోను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ఇతడే నా లవ్ అంటూ పరిచయం చేసింది.

హల్లో గుడ్ మార్నింగ్.. మై లవ్ అంటూ హార్ట్ సింబల్ పెట్టి పోస్టు చేసింది. దాంతో అభిమానులు అభినందనలు తెలియజేస్తూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఫ్యాన్ పేజ్‌లో వచ్చిన ఫోటో ప్రియుడిదేనా అనే అనుమానం కలుగుతుంది. సుహానా దానికి సమాధానం ఇస్తే అసలు క్లారిటీ వచ్చేస్తుంది.

ఇన్స్‌టాగ్రామ్‌లో మాస్ ఫాలోయింగ్

ఇన్స్‌టాగ్రామ్‌లో మాస్ ఫాలోయింగ్

సుహానా ఖాన్ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఇన్స్‌టాగ్రామ్‌లో సినీ హీరోయిను తలదన్నేలా ఫాలోయింగ్ ఉంది. దాదాపు 1.9 మిలియన్ ఫాలోవర్స్ ఆమెకు ఉన్నారు. సందర్భం ఏదైనా దానిని బట్టి తన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకొంటారు. తాజాగా ప్రియుడి గురించిన సమాచారం ఇచ్చి అనుమానాలను తీరుస్తుందా అనేది వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X