twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగబాబుకు శివాజీ రాజా రిటర్న్ గిఫ్ట్... ‘మా’ఓటమికి ప్రతీకారం.. పవన్‌పై కూడా దెబ్బ అలా అంటూ!

    |

    ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత పార్టీల ఓటమి, విజయంపై సమీక్షలు ప్రారంభమయ్యాయి. ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ దారుణమైన ఓటమిని పొందడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాకలో ఓటమి పాలు కావడం సానుభూతి వ్యక్తమవుతున్నది. ఇలాంటి పరిస్థితుల మధ్య పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు ఓటమిపై సినీ వర్గాల్లో ఓ కొత్త చర్చ జరుగుతున్నది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో విభేదాలు పవన్ కల్యాణ్, నాగబాబు ఓటమి ఓ కారణం అంటూ ఓ వాదన వినిపిస్తున్నది. వివరాల్లోకి వెళితే..

     మా ఎన్నికల్లో పెరిగిన విభేదాలు

    మా ఎన్నికల్లో పెరిగిన విభేదాలు

    మా ఎన్నికల ప్రభావం మెగా ఫ్యామిలీపై భారీగానే పడినట్టు కనిపిస్తున్నది. రెండు నెలల క్రితం జరిగిన మా ఎన్నికల్లో అప్పటి అధ్యక్షుడు శివాజీ రాజాకు వ్యతిరేకంగా మెగా హీరోలు, ముఖ్యంగా నాగబాబు ప్రచారం చేయడం వివాదంగా మారింది. ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌కు నాగబాబు బహిరంగంగా మద్దతు తెలిపి అతడి విజయానికి, శివాజీ రాజా ఓటమికి కారణమయ్యాడనే విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు.

    నాగబాబుపై శివాజీరాజా ఫైర్

    నాగబాబుపై శివాజీరాజా ఫైర్

    అయితే మా ఎన్నికల్లో ఊహించని విధంగా ఓటమి పాలు కావడాన్ని నటుడు శివాజీ రాజా జీర్ణించుకోలేకపోయాడు. ఓటమి అనంతరం ప్రెస్ మీట్ పెట్టి నాగబాబుపై దారుణమైన పదజాలాన్ని ఉపయోగించి విమర్శలు, ఆరోపణలు చేశారు. నడవటానికి చేతకాని అంగవైకల్యంతో బాధపడే వ్యక్తి అంటూ విమర్శలు చేశాడు. అంతేకాకుండా తన ఓటమికి కారణమైన నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని బహిరంగా సవాల్ చేశాడు.

     నాగబాబుకు వ్యతిరేకంగా ప్రచారం

    నాగబాబుకు వ్యతిరేకంగా ప్రచారం

    ఏపీ ఎన్నికల్లో జనసేన తరఫున నాగబాబు నరసాపురం పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేయడం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో తన ఓటమికి ప్రతీకారం తీర్చుకొనేందుకు శివాజీ రాజా భారీగా ప్లాన్ చేశాడనే మాట వినిపించింది. నరసాపురం స్థానికుడు కావడంతో శివాజీ రాజా అక్కడ నాగబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నాగబాబును ఓడించాలని స్థానికంగా ప్రచారం చేశారు.

     నాగబాబుపై దారుణంగా విమర్శలు

    నాగబాబుపై దారుణంగా విమర్శలు

    ఎన్నికల ప్రచారంలో నాగబాబుపై పరుష పదజాలాన్ని శివాజీ రాజా ఉపయోగించాడు. పైసా ఖర్చు పెట్టే సత్తా లేని వ్యక్తి.. మా సంఘాన్ని రెండేళ్లు వెనుకకు తీసుకెళ్లాడు. ఓ చిన్న సంస్థనే సవ్యంగా నడుపలేకపోయిన నాగబాబు.. నరసాపురం పార్లమెంట్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడా అంటూ విమర్శలు చేశాడు. ఇలా వ్యతిరేక ప్రచారం చేస్తూ స్థానికంగా ప్రభావం చూపేందుకు ప్రయత్నించాడనే వాదన వినిపించింది.

    శివాజీ రాజా రిటర్న్ గిఫ్ట్ అంటూ

    శివాజీ రాజా రిటర్న్ గిఫ్ట్ అంటూ

    ఇక ఫలితాల వెల్లడి తర్వాత జనసేన దారుణంగా పరాజయం పాలవ్వడంతో శివాజీ రాజాకు ఊరట లభించిందని ఆయన సన్నిహితులు, అభిమానులు చెప్పుకొంటున్నారు. అయితే నరసాపురం ఓటర్లను ప్రభావితం చేసే సత్తా శివాజీ రాజాకు ఉందా అనే విషయాన్ని పక్కన పెడితే.. నాగబాబు ఓటమితో ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని మాత్రం కొందరు చెప్పుకొంటున్నారు. నాగబాబుపై వ్యతిరేక ప్రచారం భీమవరంలో పవన్ కల్యాణ్‌పై కూడా పడిందనే మరో వాదన కూడా మీడియా వర్గాల్లో వినిపిస్తున్నది. దీనిపై నాగబాబు, శివాజీ రాజాలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

    English summary
    MAA Elections are going with hot phase in Tollywood. Mega hero Nagababu taken sensational decision to support Naresh Panel instead of Shivaji Raja Panel. Now, Reports suggest that Shivaji raja campaigns against Nagababu in recent AP Elections for his defeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X