శ్రియ ఆనందానికి ఆయన కూడా ఒక కారణం....
సినీ పరిశ్రమలో ఒక్కసారి వేనుకపడ్డామా, ఇక అంతే సంగతులు. మళ్ళీ తిరిగి ఫామ్ లోకి రావాలంటే...దాదాపు అసాధ్యమే అని చెప్పవచ్చు. అందునా..హీరోయిన్ల విషయంలో అయితే…ఇక చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది...పూటకొక్క హీరోయిన్ దిగుమతి అవుతున్న సమయంలో ఒకప్పుడు అగ్ర హీరోలందరి సరసన నటించిన అందాల ముద్దుగుమ్మ శ్రియ గత కొంత కాలంగా పెద్దగా సినిమాలు చేసిన దాఖలాలు లేవు. అడపా దడపా ఐటెమ్ సాంగ్ చేస్తూ వస్తూ...'డాన్ శీను"తో మళ్ళీ తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది.
తర్వాత పవన్ పులి లోనూ, ఆ తర్వాత డాన్ శీను లో కనిపించిన శ్రియ తాజాగా పానీ (నీరు) అనే హిందీ చిత్రంలో కమిటైందని సమాచారం. ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ డైరక్ట్ చేసే ఈ చిత్రం ఓ సైన్స్ ఫిక్షన్. నీటి కోసం ధనిక, పేద వర్గాల మధ్య జరిగే పోరాటాన్ని ప్రధానాంశంగా చేసుకుని ఈ చిత్రాన్ని తీస్తున్నారు. అలాగని ఈ చిత్రం మరీ ఆర్ట్ ఫిలింలా ఉండదు..మరో ప్రక్క ప్రేమ కథ కూడా నడుస్తూంటుంది. హృతిక్ రోషన్, శ్రీయ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాకేష్ రోషన్ కీలక పాత్ర చేస్తున్నారు. ఇది పక్కా కమర్షియల్ మూవీ అయినప్పటికీ ఎంతోమందిని ఆలోచింపజేసే విధంగా ఓ సందేశం కూడా ఉంటుందని చెప్తోంది.
ఇక ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందించనున్నారు. శ్రీయ ఆనందానికి ఇది కూడా ఒక కారణం. శేఖర్ కపూర్ దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందంటోంది శ్రీయ. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంతో పాటు శ్రియ…సిద్దార్ధ సరసన దీపా మెహతా దర్శకత్వంలో రూపొందే మిడ్ నైట్స్ చిల్డ్రన్ అనే ఇంగ్లిష్ చిత్రంలో, తమిళంలో రౌదిరం, మలయాళంలో కాసనోవా చిత్రాల్లో కనిపించనుంది. అలాగే శ్రీయ హీరోయిన్ గా చేసిన తమిళ చిత్రం చికుబుకు ఈ రోజు(డిసెంబర్ 3)న విడుదలవుతోంది.


Click it and Unblock the Notifications











