నిజంగా సిద్దార్ధ...ఎన్టీఆర్ ని చూసి భయపడుతున్నాడా?
ఇన్నాళ్ళూ క్లాస్ లో నాకు పెద్ద పోటీ లేదనుకున్నాను. అలాంటిది ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు కూడా ఇలా క్లాసులోకి ప్రవేశిస్తే మేం వాలింటరీ రిటైర్మెంట్ తీసుకోవాలేమో అంటూ సిద్దార్ద..బృందావనం ఆడియో పంక్షన్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారాయి. తాను ఎన్టీఆర్ కి పెద్ద ప్యాన్స్ ని అని చెప్తూనే సిద్దార్ధ ఇలా మాట్లాడారు. ఇక బృందావనం చిత్రంలో ఎన్టీఆర్ గెటప్ చాలా క్లాస్ గా ఉంటుందని అందుకునే సిద్దార్ధ అలా స్పందించాడని చెప్తున్నారు. ఇక సిద్దార్ధ ప్రస్తుతం బావ అనే చిత్రంలో చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో సాంగ్ షూటింగ్ జరుపుకుంటోంది. రాజేంద్రప్రసాద్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించే ఈ చిత్రంలో ప్రణీత హీరోయిన్ గా చేస్తోంది. బొమ్మరిల్లు తర్వాత వరస ప్లాపులతో కొట్టిమిట్టాడుతున్న సిద్దార్ద ఈ చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఈ చిత్రాన్ని రాంబాబు అనే దర్శకుడు గ్రామీణ నేపధ్యంలో తెరకెక్కిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











