శ్రీదేవికి షాకుల మీద షాకులు.. జాన్వీ కపూర్‌తో తలనొప్పి.. డైరెక్టర్ వ్యవహారంపై..

అలనాటి అందాల తార శ్రీదేవి తన కూతురు జాన్వీ కపూర్‌ను బాలీవుడ్ తెరకు పరిచయం చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఏడాది కాలంగా ప్రయత్నాలు జరుగుతున్న కొలిక్కి రాకపోవడంతో శ్రీదేవికి కూతురు ఎంట్రీపై బెంగ పెట

By Rajababu

అలనాటి అందాల తార శ్రీదేవి తన కూతురు జాన్వీ కపూర్‌ను బాలీవుడ్ తెరకు పరిచయం చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఏడాది కాలంగా ప్రయత్నాలు జరుగుతున్న కొలిక్కి రాకపోవడంతో శ్రీదేవికి కూతురు ఎంట్రీపై బెంగ పెట్టుకొందట. అందుకు కారణమైన డైరెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు బాలీవుడ్‌కు చెందిన ఓ పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఆ డైరెక్టర్ వ్యవహారంతో శ్రీదేవి కోపం పీక్స్ చేరినట్టు ఆ కథనం సారాశం.

Recommended Video

Filmibeat Top 10 ఫిల్మీ బీట్ టాప్ 10
సైరత్ సినిమా రీమేక్‌గా

సైరత్ సినిమా రీమేక్‌గా

గతేడాది బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ చేతుల మీదుగా జాన్వీ కపూర్ సినీ ఎంట్రీకి ప్లాన్ చేసింది. అందుకు అనుగుణంగానే మరాఠీ భాషలో ఘన విజయం సాధించిన సైరత్ చిత్రాన్ని రీమేక్‌గా చేయాలని నిర్ణయించారు. దాంతో శ్రీదేవి అభిమానులు కూడా ఆనందంలో మునిగారు. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకుండా కరణ్ నాన్చడం మొదలుపెట్టారు.

జాన్వీ సినిమాను పక్కన పెట్టి

జాన్వీ సినిమాను పక్కన పెట్టి

శ్రీదేవి కూతురు జాన్వీ సినిమాను పక్కన పెట్టి హీరో అక్షయ్ కుమార్‌తో కేసరి, అలియా భట్, రణ్‌బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్‌తో బ్రహ్మస్త్ర అనే చిత్రాన్ని కరణ్ జోహార్ పట్టాలెక్కించాడు. దాంతో శ్రీదేవికి అసహనం భారీగా పెరిగిపోయిందట. బాలీవుడ్‌కు చెందిన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరణ్ తీరును ఎండగట్టిందట.

కరణ్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తే..

కరణ్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తే..

ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. నా కూతురి ప్రాజెక్ట్ ప్రారంభిస్తే మంచిదనే అభిప్రాయాన్ని శ్రీదేవి వ్యక్తం చేసిందట. కూతురుకు సంబంధించిన సినీ రంగ ప్రవేశం ఆలస్యం కావడంపై అసంతృప్తితో ఉన్నట్టు కథనంలో పేర్కొన్నారు.

జోరు మీద సైఫ్ ఆలీ ఖాన్ కూతురు

జోరు మీద సైఫ్ ఆలీ ఖాన్ కూతురు

ఇదిలా ఉండగా, జాన్వీ కపూర్ కంటే వెనుకగా ప్లాన్ చేసిన సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా ఆలీ ఖాన్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఇటీవల కేదారినాథ్‌లో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకొన్నది. అయితే జాన్వీ కపూర్ సినిమా అసలు ప్రారంభం కాకపోవడంపై బాలీవుడ్‌లో పలువురు పలు రకాలుగా గుసగుసలాడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X