శ్రీకాంత్ సినిమా రిలీజ్ అయ్యేనా?

By Srikanya

శ్రీకాంత్ హీరోగా చేసిన అఆఇఊ కి ఇప్పటికైనా మోక్షం వస్తుందా అని సినీ వర్గాల్లో చర్చ మొదలైంది.ఈ చిత్రం చాలా కాలంగా విడుదల కోసం ఎదురుచూస్తోంది. అయితే శ్రీకాంత్ వందవ చిత్రం మహాత్మ రిలీజ్ కావటంతో అఆఇఈ దర్శక,నిర్మాతలలో ఆశలు మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని కొని రిలీజ్ చేసేవారు వస్తారని ఆశిస్తున్నారు. ఇక 'అఆఇఈ' చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా మీరాజాస్మిన్ కనిపిస్తూంటే సదా సెకెండ్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాలో సదా టాక్సీ డ్రైవర్ శ్రీకాంత్ కి భార్యగా కనిపిస్తుంది. కామిడీ చిత్రాల దర్శకుడు శ్రీనివాస రెడ్డి ఈ చిత్రం పూర్తి స్ధాయి నవ్వులతో నిండి ఉంటుందంటున్నాడు.

అదిరిందయ్యా చంద్రం,యమగోల మళ్ళీ మొదలైంది,టాటా బిర్లా మధ్యలో లైలా,చందనా బ్రదర్స్ బొమ్మనా సిస్టర్స్ వంటి పలు కామిడీ చిత్రాలను రూపొందించిన శ్రీనువాస రెడ్డి 'అఆ ఇఈ' డైరక్ట్ చేసారు.తన యమగోల మళ్ళీ మొదలైందిసినిమాలతో హిట్ పెయిర్ గా ప్రూవ్ అయిన (శ్రీకాంత్,మీరాజాస్మిన్)లను ఈ చిత్రానికీ ఎన్నుకున్నారు.ఇక ఈ సినిమాను బొడ్డం అశోక్ యాదవ్ నిర్మిస్తున్నాడు. అఆ ఇఈ టైటిల్ పూర్తి ఫాం అతను ఆమె...ఇంతలో ఈమె.

ఇక ఈ సినిమాలో బ్రహ్మానందం, ఏ.వి.యస్.జయప్రకాష్ రెడ్డి, వేణు మాధవ్, సునీల్, ఎమ్.ఎస్.నారాయణ, చంద్రమోహన్, కవిత, కోవై సరళ, హేమ, అపూర్వ తదితరులు నటించనున్నారు.కథ-మాటలు గొల్లపాటి నాగేశ్వరరావు అందిస్తూండగా, భాస్కరభట్ల పాటలు, కెమెరా విజయ్ సి.కుమార్, సంగీతం ఎమ్.ఎమ్ శ్రీలేఖ సమకూరుస్తున్నారు.ఇప్పటికైనా ఈ సినిమా రిలీజ్ కావాలని కోరుకుందాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X