»   » హీరోలకు ముఖం చాటేస్తున్న రాజమౌళి.. ఫోన్ నంబర్ మార్చి.. అసలేం జరిగిందంటే..

హీరోలకు ముఖం చాటేస్తున్న రాజమౌళి.. ఫోన్ నంబర్ మార్చి.. అసలేం జరిగిందంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాహుబలి2 చిత్రంతో దర్శకుడు రాజమౌళి క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. ఆయన తెరకెక్కించిన విధానాన్ని చూసి హీరోలు కూడా అభిమానులు అయిపోయారు. ఒక్కసారిగా దేశంలోనే ఎక్కువ ప్రేక్షకాదరణ ఉన్న దర్శకుల జాబితాలో రాజమౌళి కూడా చేరిపోయారు. బాహుబలి టేకింగ్ చూసి రాజమౌళితో సినిమా చేయాలని బాలీవుడ్ అగ్ర హీరోలు కూడా ముందుకు వస్తున్నారు. అయితే రాజమౌళితో టచ్‌లో ఉందామనే కోరికతో కొందరు బాలీవుడ్ హీరోలు ప్రయత్నిస్తే వారికి నిరాశే ఎదురైందట. అసలేం జరిగిందంటే..

  ఫోన్స్‌కాల్స్ మానేశాడట..

  ఫోన్స్‌కాల్స్ మానేశాడట..

  బాహుబలి సంచలన విజయం తర్వాత రాజమౌళికి ఫోన్ కాల్స్ తాకిడి వరదలా ముంచెత్తింది. తాకిడిని తట్టుకోలేక ఫోన్ కాల్స్‌ ఎత్తేయడం మానేశాడట. ఓ దశలో ఎవరికీ కనిపించకుండా కొన్ని రోజులు విహారయాత్రకు వెళ్లాడనే వార్తలు వచ్చాయి. ఆ క్రమంలో బాహుబలి విజయాన్ని పురస్కరించుకొని కొందరు హీరోలు కంగ్రాట్స్ చెబుదామని ప్రయత్నిస్తే వారికి అందుబాటులోకి రాలేదట.


  SS Rajamouli opens up about his next film | Filmibeat Telugu
  మహాభారతం సినిమా అని ప్రచారం..

  మహాభారతం సినిమా అని ప్రచారం..

  బాహుబలి తర్వాత రాజమౌళి మహాభారతం సినిమాను రూపొందిస్తున్నట్టు ఓ వార్త మీడియాలో ప్రచారం జరిగింది. అమీర్ ఖాన్, మోహన్ లాల్ లాంటి నటులతో సినిమాను తెరకెక్కించనున్నారు అనే విషయం బయటకు వచ్చింది. దాంతో బాలీవుడ్‌కు చెందిన కొందరు హీరోలు రాజమౌళిని సంప్రదించేందుకు ప్రయత్నించారట.


  మరో ఫోన్ నంబర్‌తో ..

  మరో ఫోన్ నంబర్‌తో ..

  ఇలా అనేక రకాలుగా కాల్స్, మెసేజ్‌లు కుప్పలు తెప్పలుగా వస్తుండటంతో రాజమౌళి వాటికి అప్పట్లో స్పందించడం మానేశాడటనేది సమాచారం. అందరికీ తెలిసిన ఫోన్ నంబర్‌ను స్విచ్ఛాఫ్ చేసి మరో నంబర్‌లో సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉంటూ వచ్చినట్టు బాలీవుడ్‌కు చెందిన పత్రిక కథనాన్ని వెల్లడించింది.


  తదుపరి సినిమాపై క్లారిటీ లేదు..

  తదుపరి సినిమాపై క్లారిటీ లేదు..

  బాహుబలి తర్వాత తదుపరి సినిమాపై అనేక రకాలుగా వార్తలు ప్రచారమయ్యాయి. కరణ్ జోహర్‌తో సినిమా చేస్తున్నాడని ఓ సారి. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌, ప్రభాస్‌తో సినిమా చేస్తున్నాడని మరోసారి వార్తలు వచ్చాయి. కానీ రాజమౌళి నుంచి అధికారిక ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ టాలీవుడ్‌కు చెందిన నిర్మాతతో కమిట్ అయినందున తన తదుపరి సినిమాను తెలుగులోనే చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.


  మల్టీ స్టారర్ సినిమా అంటూ ప్రచారం..

  మల్టీ స్టారర్ సినిమా అంటూ ప్రచారం..

  బాహుబలి తర్వాత క్రేజీ డైరెక్టర్‌గా మారిన రాజమౌళితో సినిమా చేసేందుకు పలువురు హీరోలు ఎదురు చూస్తున్నారు. మహేశ్, ఎన్టీఆర్‌తో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఏది ఏమైనా బాహబులి తర్వాత ఆ అదృష్టం ఎవరికీ దక్కుతుందో అనే విషయం చర్చనీయాంశమైంది.  English summary
  After Baahubali 2, Rajamouli was planning another film that would match up to his magnum opus. Report suggest that Rajamouli is keen on Mahabharat with Aamir Khan, Mohanlal. In this juncture Many Bollywood stars young and seniors have tried to contact the filmmaker. But Rajamouli has been ignoring all calls and messages. He has switched off and is in fact using another number to stay in touch with his near and dear ones.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more