చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి సినిమా రీమేక్ అట.. నిర్మాత క్లారిటీ.. ఆగని రూమర్లు!

By Rajababu

Recommended Video

One More Interesting News About RRR Movie Story

బాహుబలి చిత్రం తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. బాహుబలి రిలీజై ఏడాది గడిచిపోయినా ఇంకా మరో సినిమాను మొదలుపెట్టలేకపోయారు. ప్రస్తుతం తన తండ్రి కేవీ విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి మల్టీస్టారర్ సినిమాకు కథను వండేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి రాజమౌళి మల్టీస్టారర్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్‌గా ఆర్ఆర్ఆర్ అని నిర్ణయించారు. ఈ సినిమా కథపై అనేక ఊహాగానాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మోషన్ పోస్టర్‌తో రాజమౌళి క్రేజ్!

మోషన్ పోస్టర్‌తో రాజమౌళి క్రేజ్!

గత మార్చిలో నిర్మాత డీవీవీ దానయ్య ఆర్ఆర్ఆర్ అనే చిత్ర మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఈ చిత్రంపై మరింత క్రేజ్ పెరిగింది. ఈ సినిమా కథ ఏంటా అని సినీ వర్గాలు ఆరా తీయడం మొదలుపెట్టారు. రకరకాల కథలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి.

కరణ్ అర్జున్ రీమేక్

కరణ్ అర్జున్ రీమేక్

అయితే తాజాగా ఈ చిత్రం 90లో వచ్చిన హిందీ చిత్రం రీమేక్ అనే మాట బలంగా వినిపిస్తున్నది. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ నిర్మించిన కరణ్ అర్జున్ సినిమాకు రీమేక్ అనే మాట ఇటీవల కాలంలో విస్తృతంగా వైరల్ అయింది. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసింది. ఆ చిత్రానికి హృతిక్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.

నిర్మాత క్లారిటీ అయినా..

నిర్మాత క్లారిటీ అయినా..

రాజమౌళి చిత్రంపై ఊహాగానాలు పెరిగిపోతున్న నేపథ్యంలో నిర్మాత డీవీవీ దానయ్య ఇటీవల క్లారిటీ ఇచ్చారు. మీడియాలో వస్తున్న వార్తలో వాస్తవం లేదు. ఆ సినిమా కథ గురించి ఇప్పుడు చెప్పడం భావ్యం కాదు. మరో నెలలో కథ, ఇతర విషయాల గురించి పూర్తి క్లారిటీ వస్తుంది అని దానయ్య అన్నారు.

300 కోట్ల బడ్జెట్

300 కోట్ల బడ్జెట్

రాంచరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చే చిత్రం రూ.300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్నది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కథపై విజయేంద్ర ప్రసాద్ కసర్తతు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా వివరాలను వెల్లడిస్తామని డీవీవీ దానయ్య చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X