నటసింహా బాలయ్యకే పోటీ ఇచ్చే రేంజ్ కి వచ్చిన హాస్య సింహా....
అందాలరాముడు, మర్యాదరామన్న చిత్రాల ద్వారా తనలో హీరో మెటీరియల్ పుష్కలంగా ఉందన్న విషయాన్ని బలంగా నిరూపించుకున్న సునీల్..ఇప్పుడు ఏకంగా నందమూరి నటసింహం బాలకృష్ణకే పోటీ ఇచ్చే రేంజ్ కు ఎదిగాపోయాడు..మూడో సినిమాను ఏకంగా రామ్ గోపాల్ వర్మ డైరక్షన్ లోనే చేసే సువర్ణావకాశాన్ని స్వంతం చేసుకుని, హీరోగా ఫస్ట్ హ్యాట్రిక్ సాధించేందుకు సమాయత్తమవుతున్న సునీల్..సాక్షాత్తూ బాలకృష్ణనే ఢీకొంటున్నాడు..
పరుచూరి మురళి దర్శకత్వంలో ఎం ఎల్ కుమార్ చౌదరి నిర్మాతగా బాలకృష్ణ నటించే చిత్రం రేపు(ఆగస్ట్ 27)ప్రారంభం కానుండగా, సునీల్ సినిమా కూడా రేపే ఇంచుమించుగా అదే ముహూర్తానికి ప్రారంభం కానుంది. పైగా బాలకృష్ణ సినిమాకు లేని ప్రత్యేకత సునీల్ సినిమాకు ఏమిటంటే, సునీల్ టైటిల్ పాత్ర పోషిస్తున్న 'కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం..అప్పల్రాజు" చిత్రం ప్రారంభోత్సవానికి సాక్షాత్తూ శ్రీదేవి ఛీఫ్ గెస్ట్ గా వస్తుండడం.
బాలకృష్ణ సినిమాకు మహా అయితే జూ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు వస్తారు. కానీ వీళ్లిద్దరూ మన తెలుగు మీడియాకు చాలా తరచుగా దర్శనమిస్తూనే ఉంటారు కాబట్టి..రాక రాక వస్తున్న అతిలోక సుందరి రాకకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక రామ్ గోపాల్ వర్మతో పోలిస్తే పరుచూరి మురళి స్థాయి చాలా చిన్నది. కాబట్టి ఈ రెండు విషయాల్లోనూ నందమూరి నటసింహం పై హాస్యసింహ సునీదే పై చేయి కానుండడం విశేషం..


Click it and Unblock the Notifications











