twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వకీల్ సాబ్‌కు తరుముకొస్తున్న ప్రమాదం.. కోర్టు హెచ్చరికలతో ఫ్యాన్స్‌కు షాకే!

    |

    తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తున్నది. గత రెండు వారాలుగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో మళ్లీ వ్యాపార, వినోద పరిశ్రమలపై ఆంక్షలు విధించాలనే డిమాండ్ పెరుగుతున్నది. కరోనావైరస్‌ను కట్టడి చేయకపోతే మరింత ప్రభావం పడే అవకాశం ఉందనే ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్న సమయంలో హైకోర్టు వ్యాఖ్యలు సంచలనం రేపాయి. కోర్టు చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే..

    అనన్య నాగళ్ల లవ్లీ లుక్స్.. వకీల్‌సాబ్ చిత్రంతో మరో రేంజ్‌కు మల్లేశం హీరోయిన్

    సినీ పరిశ్రమను కుదిపేస్తున్న కరోనావైరస్

    సినీ పరిశ్రమను కుదిపేస్తున్న కరోనావైరస్

    దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమల్లో పలువురు సెలబ్రిటీలు, ప్రముఖ హీరో,హీరోయిన్లు కరోనావైరస్ కాటుకు గురవుతున్నారు. టాలీవుడ్‌లో అల్లు అరవింద్, నివేదా థామస్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వారికి ఇప్పటికే పాజిటివ్ అనే నిర్ధారణ జరిగింది.

    దేశవ్యాప్తంగా రికార్డు కేసులు

    దేశవ్యాప్తంగా రికార్డు కేసులు

    ఇక సాధారణ ప్రజలు కూడా కరోనావైరస్ బారిన పడుతూ హాస్పిటల్‌లో చేరుతున్నారు. రోజు రోజుకు కరోనావైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే స్కూల్స్, కాలేజీలు మూసి వేయడంతో దిక్కు తోచని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో హైకోర్టు ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

    తెలంగాణ సర్కారుపై హైకోర్టు సీరియస్

    తెలంగాణ సర్కారుపై హైకోర్టు సీరియస్

    కరోనావైరస్ కేసులు పెరుగుతున్న సమయంలో సర్కారుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విధంగా కోర్టు స్పందించింది. మద్యం దుకాణాలు, బార్లు, పబ్బులు, థియేటర్లపై ఆంక్షలు ఎందుకు విధించలేదు అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 48 గంటల్లో ప్రభుత్వం వివరణ ఇవ్వాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది.

    50 శాతం అక్యుపెన్సీతో

    50 శాతం అక్యుపెన్సీతో

    సినిమా ప్రదర్శనల విషయంలో కొంత కఠినంగా వ్యవహరించాలి. ఆడియెన్స్ ఆక్యుపెన్సీపై ఆంక్షలు విధించాలి. థియేటర్లలో 100 శాతం అక్యుపెన్సీని తగ్గించాలి. దాంతో కరోనావైరస్‌ను అడ్డుకట్టు వేయడానికి మార్గం ఏర్పడుతుంది అనే విధంగా కోర్టు సూచించినట్టు సమాచారం. ఈ క్రమంలో థియేటర్లలో ప్రదర్శనలకు 50 శాతం ఆక్యుపెన్సీకి మొగ్గు చూపుతుందా అనే మాట వినిపిస్తున్నది.

    వకీల్ సాబ్ రిలీజ్ నేపథ్యంలో

    వకీల్ సాబ్ రిలీజ్ నేపథ్యంలో

    కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడిస్తుందనే విషయం ఆసక్తిగా మారింది. సినిమా థియేటర్లపై ఆంక్షలు విధిస్తే వకీల్ సాబ్‌ ప్రదర్శనలకు సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. థియేటర్లలో 50 శాతం మేరకే ప్రేక్షకులకు అనుమతి ఇవ్వాలనే నిబంధన తెచ్చినా భారీ ధరకు కొనుగోలు చేసిన డిస్టిబ్యూటర్ల పరిస్థితి ఏమిటనే వాదన మొదలైంది. ప్రభుత్వం కోర్టు ఆదేశాలకు ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

    English summary
    Telangana High court warnig to KCR government over Coronavirus cases rise in the state. High Court is serious on TG Govt....High Court asks the government to respond within 48 hours. In this occassion, Report says that High court orders may effect Vakeel Saab release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X