Just In
- 1 hr ago
‘RRR’ తర్వాత రామ్ చరణ్ చేసేది ఆయనతోనే.. చిరంజీవి సలహా వల్లే ఈ నిర్ణయం.!
- 2 hrs ago
బాలయ్య-బోయపాటి చిత్రానికి ముహుర్తం ఖరారు.. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫిక్స్
- 2 hrs ago
ఆసక్తి రేకెత్తించిన క్వీన్ ట్రైలర్.. అమ్మగా ఆకట్టుకున్న రమ్యకృష్ణ
- 3 hrs ago
అత్యాచారం తప్పదనుకున్నప్పుడు వెనక్కి పడుకుని ఎంజాయ్ చేయండి.. అమితాబ్ సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
నిత్యానందకు ఫ్రెంచ్ ప్రభుత్వం షాక్.. 4 లక్షల డాలర్ల ఫ్రాడ్ కేసులో విచారణ
- Sports
400 క్లబ్: తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించేందుకు సిక్స్ దూరంలో రోహిత్ శర్మ
- Automobiles
మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్-6 వచ్చేసింది.. మారుతి బ్రిజా, టాటా నెక్సాన్‌లకు గట్టి షాక్!!
- Technology
బెటర్ సెక్యూరిటీతో క్వాల్కామ్ 3డి సోనిక్ మ్యాక్స్
- Lifestyle
అంగస్తంభన పెంచే మాత్రలు తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు!
- Finance
హాల్‌మార్కింగ్ ద్వారా కస్టమర్లకు ఎంతో ప్రయోజనం, భరోసా
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
కావాలనే దేవీ శ్రీ ప్రసాద్‌ను పట్టించుకోలేదా.. తమన్ ట్వీట్‌పై అనుమానాలు
ఒకే వృత్తిలో ఉన్న వారికి ఎంతో కొంత పోటీ ఉండనే ఉంటుంది. పైగా సినీ ఇండస్ట్రీలో అది బాహాటంగానే కనిపిస్తుంది. ప్రస్తుతం తమన్, దేవీ శ్రీ ప్రసాద్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ అందరికీ తెలిసిందే. తమన్ తన సంగీతంతో తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ మాత్రం సైలెంట్‌గా ఉండిపోయాడు. పైగా చేతిలో ఏ ప్రాజెక్ట్ లేదని బయట కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆయన సరిలేరు చిత్రంతోనే నిరూపించుకోవాలని అది మిస్ అయితే దేవీ పని అయిపోయినట్టేనని టాక్ నడుస్తోంది.

కొత్త ట్యూన్స్‌తో ఊపేస్తున్న తమన్
ట్రెండీగా మారిన సామజవరగమన అలవైకుంఠపురములో నుంచి విడుదలైన మొదటి సాంగ్.. సామజవరగమన. రిలీజైన కొద్ది క్షణాల్లోనే ఈ పాట వైరల్‌గా మారింది. తెలుగులో అత్యధిక మంది వీక్షించిన, లైకులు సాధించిన పాటగా రికార్డులకెక్కింది. ఇప్పటికీ ఈ సాంగ్ అప్రతిహతంగా దూసుకుపోతూనే ఉంది.

రాములో రాముల అంటూ సెన్సేషన్..
రెండో పాటగా విడుదలైన రాములో రాముల సాంగ్ మాస్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పార్టీలు, పబ్‌లు, డీజేలు ఇలా ఎక్కడ చూసినా రాములో రాముల అనాల్సిందే. ఈ పాటను అంతే అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ సిగ్నేచర్ స్టెప్పులు వైరల్ అయ్యాయి.

మూడో పాట కూడా వైరల్..
అలవైకుంఠపురములో నుంచి విడుదలైన మూడో పాటను కూడా ట్రెండీగా ఉండటంతో ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం తమన్ జపం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎక్కడ ఏ పాట విడుదలైనా తమన్ పేరే కనిపిస్తోంది. ఆయన పాటే వినిపిస్తోంది. ప్రతి రోజూ పండగే, డిస్కో రాజా ఇలా విడుదలైన ప్రతీ పాట తమన్ మార్క్‌ను చూపిస్తోంది. ప్రస్తుతం తెలుగులో తమన్ దూసుకుపోతున్నాడు.

సైలెంట్ అయిన దేవీ..
ఆ మధ్య సరిలేరు టైటిల్ సాంగ్‌తో కొన్ని విమర్శలు మూట గట్టుకున్న దేవీ.. ఆపై మళ్లీ మరో పాటను రిలీజ్ చేయలేదు. తమన్ మాత్రం ఇలా పాట మీద పాట రిలీజ్ చేసుకుంటూ పోతూ సోషల్ మీడియాలో కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుండగా.. దేవీ మాత్రం మౌనంగా ఉండిపోయాడు.
|
సరిలేరు టీజర్‌తో దుమ్ములేపాడు..
సరిలేరు టీజర్లో అందరూ డైలాగ్స్‌తో రెచ్చిపోగా.. వారందరి ఎమోషన్‌ను తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఎలివేట్ చేశాడు. సోషల్ మీడియాలో దేవీ అందించిన నేపథ్య సంగీతానికి ప్రశంసలు లభిస్తుండగా.. తమన్ మాత్రం పూచిక పుల్లను తీసి పారేసినట్టుగా కనిపిస్తోంది.

అందర్నీ ప్రశంసించి.. దేవీని విస్మరించాడు..
ఈ టీజర్‌ను ప్రశంసిస్తూ.. మహేష్ బాబు, అనిల్ రావిపూడి, దిల్ రాజులను ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు తమన్. కానీ తన వృత్తిలో భాగమైన సంగీతం నేపథ్య సంగీతం గురించి కామెంట్ చేయలేదు.. దేవీని ప్రశంసించలేదు. తమన్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.