ప్రభాస్ సినిమాను మధ్యలో విడిచిపెట్టాల్సి వచ్చింది.. తమన్ ఆవేదన
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మ్యూజిక్ డైరెక్టర్ గా టాలీవుడ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలువురు స్టార్ హీరోల సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ అందించారు. తాజాగా సంక్రాంతి బరిలో నిలిచిన గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ అందించి ప్రేక్షకులను ఫిదా చేశారు. మెయిన్ గా తమన్ డాకు మహారాజ్ కు అందించిన ఆర్ఆర్ మాత్రం దుమ్మురేగుతుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ తనని ప్రభాస్ సినిమా నుండి తీసివేశారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో ?
మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. ఈ సంక్రాంతికి భారీ సక్సెస్ అందుకున్నాడని చెప్పాలి. తాను మ్యూజిక్ అందించిన గేమ్ చేంజెర్, డాకు మహారాజ్.. సినిమాలు మ్యూజిక్ పరంగా విజయం సాధించాయి. గేమ్ చేంజర్ కు తమన్ వేరే లెవెల్ ఆర్ఆర్ అందించాడు. ఇక బాలయ్య 'డాకు మహారాజ్' సినిమా ఆర్ఆర్ మాత్రం బీభత్సమే అనాలి. మాస్ ఆడియన్స్ తమన్ మ్యూజిక్ ఆర్ ఆర్ కు పూనకాలు వచ్చేస్తున్నాయి. తాజాగా గేమ్ చేంజ్ లో తమన్ కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడిస్తూ లోనయ్యారు.

ఆయన మాట్లాడిన మాటలు అందర్నీ ఆలోచింపజేస్తున్నాయి. ఎంతో కష్టపడి సినిమాలను తీస్తే.. ఆ సినిమాలపై ఎందుకు ఇలా నెగటివ్ క్రియేట్ చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదు అంటూ ఎమోషనల్ అయ్యారు. సినిమా బతకాలని, నిర్మాతలు బతకాలని కోరుకుంటున్నాననీ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివిటీ ట్రెండ్ ట్రోలింగ్ చూస్తే తనకు బాధగా, సిగ్గుగా, భయంగా ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ కు చిరంజీవి సైతం స్పందించారు. మాట ఒకరిని ఇన్స్పైర్ చేయగలదు. అలాగే నాశనం నువ్వు చేయగలరు పాజిటివ్ గా ఉండండి అంటూ చిరంజీవి హిట్ చేశారు. దీంతో పవన్ మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
ఇదిలా ఉంటే.. తమన్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న అవమానాల గురించి వెల్లడించారు. ఏదైనా ప్రాజెక్ట్ మధ్యలో ఉండగా తొలగించిన సందర్భాలు ఉన్నాయని ప్రశ్నించగా .. తమను ఏమాత్రం ఆలోచించకుండా ప్రభాస్ నటించిన రెబల్ చిత్రానికి తనని మొదటగా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నారని, మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా జరిగాయని, కానీ, అనుకోకుండా తనని తొలగించారని వెల్లడించాడు. ఎందుకు తనని తొలగించారో ఇప్పటి కూడా సరైన కారణం తెలియదని షాకింగ్ కామెంట్స్ చేశారు తమన్.
రెబల్ సినిమా ప్రభాస్ కాంబినేషన్లో అది నా ఫస్ట్ మూవీ అవుతుందని భావించానని అన్నారు. ఆ సినిమా కోసం తాను బెస్ట్ మ్యూజిక్ ఇవ్వాలని చాలా ప్రిపేర్ అయ్యానని చెప్పారు. కానీ, ఆ సినిమా నుండి తనని సడన్గా తీసివేశారని తమన్ తన ఆవేదనను వెల్లడించారు. అయితే తమన్ కు, ఆ సినిమా డైరెక్టర్ లారెన్స్ కు మధ్య విభేదాలు తలెత్తాయని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఆ ఆ కారణంతో తమన్ను తొలగించి మ్యూజిక్ డైరెక్టర్ బాధితులను కూడా లారెన్స్ చూసుకున్నాడు కానీ ఈ సినిమా ప్రభాస్ హిస్టరీలో భారీ డిజాస్టర్ గా నిలిచింది.
Rebel-Cinema.. that was my first film with #Prabhas garu, ..I wanted to give the Best-Music but that went way half through. 🙃 pic.twitter.com/dI4gG36KvU
— . (@charanvicky_) January 18, 2025


Click it and Unblock the Notifications











