'లీకేజ్'..రాజమౌళి ప్రీ ప్లాన్డ్ డ్రామనా?

దాంతో పరిశ్రమలో వారంతా ఆవేశపడి ఇది మంచి పద్దతి కాదు..మొన్న రజనీకాంత్ సినిమా పాట స్టిల్స్ లీకయ్యాయి...ఇప్పుడు ఇవి...మరీ ఎథిక్స్ లేకుండా పోయాయంటూ పబ్లిగ్గా తిట్టేసి రాజమౌళిని ఓదార్చే ప్రయత్నం చేసారు. అయితే ఈలోగా ఇదంతో రాజమౌళి అనుసరిస్తున్న పబ్లిసిటీ వ్యూహంలో ఓ భాగం అని బయిటపడిందిట. దాంతో నాలుకకరుచుకున్న వాళ్ళంతా అసలు ఎవరికి ఎథిక్స్ లేవు...అంటూ హడావిడిగా ఆలోచనలో పడిపోయారు.
తమ సినిమాను డైరక్ట్ గా ట్రైలర్స్ ద్వారా,సినీ పత్రికల ఎడ్వర్ టైజ్ మెంట్స్ ద్వారా ఎంత పబ్లిసిటీ చేసినా రాని పేరు...గుర్తింపు ఇలా దొంగచాటుగా దొరికే క్లిప్ ల ద్వారా వస్తుందని ఆయన భావించారని అంతర్గత వర్గాల సమాచారం. ఇలాంటి వాటిని అరుదుగా లభించే వస్తువులుగా భావించి అందరూ చూడటానికి ఇష్ట పడతారని కొందరు సినీ సైకాలజిస్టులని పిలవబడే కొందరు సీనియర్స్ ఇచ్చిన సలహా మేరకు రాజమౌళి చేసారని చెప్పుకుంటున్నారు. ఏదైమైనా స్కీమ్ బాగుంది కదా..ఇది వర్కవుట్ అయితే మరికొంతమంది అనుసరిస్తారు.


Click it and Unblock the Notifications











