నాగబాబు కామెంట్: అలా చేస్తే ఎన్ని మర్డర్లు జరుగుతాయో? భార్యకు ఎంజాయ్మెంట్ అక్కర్లేదా?

''హింసకు పాల్పడాలని ఏ మతం చెప్పదు. కానీ మత పెద్దలు, మతోన్మాదుల వల్లే ఇదంతా జరుగుతుంది, అసలు మతం అనేది లేకుంటే ఈ మత పెద్దలు ఉండరు, ఈ సమస్యే ఉండదు. అందుకే మతాలు ఉండకూడదని నా కోరిక. ఈ భూమి మత రహితంగా అయిపోతే చాలా సుఖమైన ప్లేసు అవుతుంది.'' అని నాగబాబు వ్యాఖ్యానించారు.

నా ఛానల్ నా ఇష్టం అంటూ తరచూ ఓ వీడియో విడుదల చేస్తూ తన మనసులోని అభిప్రాయాలను వెల్లడించే నాగబాబు... తాజాగా 'దేవుడు లేడు' అనే విషయాన్ని నొక్కి వక్కానించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దేవుడికి ఎవడూ భయపడరు

దేవుడికి ఎవడూ భయపడరు

‘‘దేవుడు అనే కాన్సెప్టు లేకుంటే ఎవరూ దేనికీ భయపడరు, విచ్చల విడితనం పెరిగిపోతుంది కదా... అనే ప్రశ్నకు నాగ బాబు రియాక్ట్ అవుతూ దేవుడికి ఎవడూ భయపడరు. తన కసి తీర్చుకోవడానికి దేవుడి పేరు చెప్పి అబద్దాలు చెబుతారు'' అని మెగాబ్రదర్ చెప్పుకొచ్చారు.

అలా చేస్తే ఎన్ని మర్డర్లు జరుగుతాయో?

అలా చేస్తే ఎన్ని మర్డర్లు జరుగుతాయో?

మనిషి భయపడేది లా అండ్ ఆర్డర్‌కు మాత్రమే. ఒక రోజు ఎవరు ఎవరినైనా కొట్టుకోవచ్చు, చంపుకోవచ్చు అనే రోజు పెట్టామనుకోండి. ఎన్ని మర్డర్లు జరుగుతాయో తెలుసా? అప్పటి వరకు పరమ పవిత్రంగా ఉండే మనిషి కూడా ఇద్దరు ముగ్గురిని చంపుతాడు. కేసు ఉండదు కాబట్టి... మతాల పేరు చెప్పి ఒకరినొకరు చంపుకుంటారని నాగబాబు అభిప్రాయ పడ్డారు.

అందరూ భయపడేది లా అండ్ ఆర్డర్‌కు మాత్రమే

అందరూ భయపడేది లా అండ్ ఆర్డర్‌కు మాత్రమే

దేవుడికి ఎవరూ భయపడడు. దేవుడికి భయపడితే ఇన్ని వరల్డ్ వార్స్ రావు, దేవుడికి భయపడితే ఇన్ని దుర్మార్గాలు జరుగవు, దేవుడికి భయపడితే ఏ రాజకీయ నాయకుడు ఇన్ని స్కాములు చేయడు. వీరంతా భయపడేది లా అండ్ ఆర్డర్‌కు మాత్రమే... అని నాగబాబు చెప్పుకొచ్చారు.

స్వర్గం, నరకం మీద నమ్మకం లేదు

స్వర్గం, నరకం మీద నమ్మకం లేదు

లా అండ్ ఆర్డర్ సరిగా ఉంటే.. దేవుడు అవసరం లేదు. పాప భీతి అనేది సరదాగా వాడుకోవడమే తప్ప ఎవరూ నమ్మరు. నాకు స్వర్గం, నరకం మీద నమ్మకం లేదు. చాలా మంది చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళతారని అంటారు. అలాంటివి ఏవీ నేను నమ్మను అని నాగబాబు తెలిపారు.

మీ భార్య కూడా పుణ్యం చేస్తుంది. ఆవిడ స్వర్గానికి వెళితే ఎవరు కంపెనీ ఇస్తారు?

మీ భార్య కూడా పుణ్యం చేస్తుంది. ఆవిడ స్వర్గానికి వెళితే ఎవరు కంపెనీ ఇస్తారు?


స్వర్గానికి వెళితే రంభ, ఊర్వశి, మేనకతో ఎంజాయ్ చేస్తారని అంటారు. ఈ కాన్సెప్టు రాసిన మహాను భావులకు ఒకేటే ప్రశ్న. మరి స్వర్గం మగాడికేనా ఉండేది? ఆడవారికి ఉండదా? వారు కూడా పుణ్యం చేస్తారు.. మీ భార్య కూడా పుణ్యం చేస్తుంది. ఆవిడ స్వర్గానికి వెళితే ఎవరు కంపెనీ ఇస్తారు? అక్కడ కూడా వారికి పూజలు పునస్కారాలేనా? మగాడు మాత్రమే రంభ ఊర్వశితో ఎంజాయ్ చేస్తాడా? జనాలు మంచి పనులు చేయడానికి మతం పెట్టిన ఒక చిన్న పాయింటే తప్ప అందులో నిజం లేదని నాగబాబు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X