పవన్ 'పంజా' చిత్రం ఫస్ట్ లుక్ ఇదేనా?
పవన్ కళ్యాణ్ కొత్త చిత్రానికి పంజా అనే టైటిల్ పెట్టే అవకాసముందని వార్తలు వస్తున్న సంగతి తెలసిందే. ఈ నేపధ్యంలో ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ అంటూ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్-దర్శకుడు విష్ణు వర్ధన్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు 'తిలక్" అనే టైటిల్ ఖరారు చేసినట్లు వస్తున్న వార్తలను ఆ సినిమా నిర్మాత శోభు యార్లగడ్డ తోసిపుచ్చారు. తిలక్ అనే టైటిల్ ఫైనల్ చేసినట్లు కొన్ని మీడియా వెబ్ సైట్లలో పేర్కొనడాన్ని ఆయన ఖండించారు. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ సినిమా వర్కింగ్ టైటిల్‌గా షాడో గా ఉంది. దీన్నే కొందరు కాళీ అంటున్నారు. ఎవరి ప్రచారం ఎలా ఉన్నా అక్టోబర్‌లో దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారు.
అప్పటి వరకు ఎలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆర్.ఎఫ్.సి, హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమాలో పవర్ స్టార్ సరసన సారా జాన్ డియాస్, అంజనా లవానియాలు నటిస్తుండగా, అడవి శేష్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాను...ఆర్కా మీడియా, సంఘమిత్ర ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విజయ దశమి నాడు విడుదల చేస్తారు. శోభుయార్లగడ్డ, తిరుమలశెట్టి నీలిమ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











