'తీన్ మార్' కలెక్షన్స్ డ్రాప్ అవటం గురించేనా త్రిష ఆ కామెంట్స్ !?
మా సినిమా ఇంత బాగా ఆడుతుంది... అంత బాగా ఆడుతుంది అని మసి పూసి మారేడుకాయ చేస్తారు. నిజం ఏమిటో ప్రేక్షకులకు తెలుసు. కొంత కాలం గడిచాక మనం కూడా అదే ఒప్పుకొంటాం అంటోంది త్రిష.ఆమె ఏ సినిమా పేరుని చెప్పి అనకపోయినా ఆమె తాజా చిత్రం తీన్ మార్ కలెక్షన్స్ డ్రాప్ అవటం గురించే ఇలా కామెంట్స్ చేస్తోందంటున్నారు.అలాగే అందరి ఉద్దేశం మంచి సినిమా తీయాలనే. కానీ ఇది అన్ని సందర్భాల్లో కుదరదు. అయినా కొంతమంది నిజాల్ని దాచి గొప్పలు చెప్పుకొంటారు.నేను నటిస్తున్న సినిమా చాలా బాగా వస్తుంది. కథ అదిరిపోతుంది. పాటలు మరింత బాగుంటాయి. ఆహా... ఓహో...' అంటూ గొప్పలు చెప్పుకొంటారు. తీరా రిలీజయ్యాక చూశాక ఆ సినిమాలో విషయం లేదనే సంగతి తెలిసిపోతుంది. ఇలా డబ్బాలు కొట్టుకోవడం నాకు ఎంత మాత్రమూ ఇష్టం ఉండదు అని చెబుతోంది.ప్రస్తుతం త్రిష వెంకటేష్ సరసన బాడీగార్డ్ రీమేక్ లో చేస్తోంది.


Click it and Unblock the Notifications











