»   » నిలువు ‘దోపిడి’ కి గురైన త్రిష !

నిలువు ‘దోపిడి’ కి గురైన త్రిష !

Posted By:
Subscribe to Filmibeat Telugu

త్రిష నిలువు దోపిడి ఇస్తానంటే కుర్రకారు ఒక్కసారిగా షాక్ తింటారనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఆ దోపిడి సేరుతోనే త్రిష నటించిన చిత్రం వస్తే నిజంగా కుర్రకారు ఏం ఊహిస్తారో కూడా ఊహించవచ్చు. త్వరలో విజయ్, త్రిష జంటగా నటించిన తమిళంలో ఘనవిజయం సాధించిన 'కురివి" చిత్రాన్ని అభిషెక్ ఫిక్ఛర్స్ పతాకంఫై నిర్మాత బి. సత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ దాదాపు 25 కోట్ల భారీ వ్యయంతో తమిళంలో నిర్మించబడిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.

ఈ చిత్రానికి ధరణి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత బి. సత్యనారాయణ మాట్లాడుతూ 'బాగా డబ్బున్న వాడు లేని వాడిని దోచుకుంటుంటే, ఓ మామూలు మనిషి బలవంతుడైన వాడిని ఏ విధంగా దోచుకుని తనవారికి ఎలా న్యాయం చేశాడన్నదే ఈ చిత్ర కథాంశం. విజయ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో మాఫియా డాన్ గా సుమన్ కీలకపాత్రను పోషించాడు. దీనిని బట్టి చూస్తే త్రిషది ఏం లేదన్నమాట..అరే ఎంతో ఆశలు రేపి ఇలా చేయడం ఏం బాగా లేదంటున్నారు..త్రిష ఫాన్స్ ఇంకా ఇతర పాత్రల్లో మాళవిక, నాజర్, ఆశిష్ విద్యార్థి, జీవి తదితరులు ముఖ్యపాత్రల్ని పోషిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu