ఉపాసనతో చరణ్ - చిరులకు లక్ తగిలిందా...!?

By Sindhu

ఉపాసన కామినేనిని పెళ్లాడి మల్టీ మిలియనీర్ అల్లుడు కాబోతున్న రామ్ చరణ్ కు ఉపాసనతో మంచి లక్కు తగిలినట్టే ఉంది. ఆమెతో వివాహ ప్రకటన అయినప్పటి నుంచి ఇప్పటికి రెండు ప్రఖ్యాత విషయాలు వెలుగు చూశాయి. అందులో ఒకటి చిరంజీవి 150 వ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడం కాగా, మరోటీ పోలో క్లబ్ ను కొనడం. ఇది ఆయన సరికొత్త మోజు. ముందునుంచి ఈ క్రీడ అంటే ఉన్న ఇష్టంతో ఒకడుగు ముందుకేసిన ఆయన ఏకంగా క్లబ్ ను కొనేశారు. అంతేకాదు, తన క్లబ్ తరఫున హైదరాబాద్ పోలో టీం అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటుందని రామ్ చరణ్ ప్రకటించాడు. తన క్లబ్ కు రామ్ చరణ్ తేజ్ హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ గా పేరు పెట్టాడు. అయితే పోలో క్రీడా వ్యవహారాల్లో తలదూర్చిన తొలి తెలుగు హీరో గా ఇతను రికార్డు సృష్టించారు.

రామ్ చరణ్ వల్ల పోలో గేమ్ కి క్రేజ్ పెరిగిందని పరిశీలకులు అంటున్నారు. క్రికెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కుర్రకారుకి పోలోపై ఉండేది కాదు. కానీ రామ్ చరణ్ హైదరాబాద్ పోలో టీమ్ ని సొంతం చేసుకోవడం, ఆ టీమ్ రెండు సార్లు టోర్నీని గెలిచి కప్ కైవసం చేసుకోవడం నగరవాసులకు ఈ గేమ్ పై ఇంట్రెస్ట్ పెరిగిందని పరిశీలకులు అంటున్నారు. అయితే ఉపాసన లక్ కాదు ఇదంతా రామ్ చరణ్ వల్లే జరిగిందని కూడా అంటున్నారు. ఇప్పుడు చాలా మంది ఈ గేమ్ ని నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X