ఆ హీరోగారి ‘అఘోర’ గెటప్ తో వీక్షకులకు విస్మయానందం...
'చంద్రముఖి' సీక్వెల్ 'నాగవల్లి" పై రోజు రోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయ్. అద్భుతంగా కట్ చేసిన 'నాగవల్లి" ట్రైలర్స్ ఆ చిత్రంపై అందిరిలోనూ క్రేజ్ పెరిగిపోతోంది. ఎందుకంటే ఈ మద్యే విడుదలైన నాగవల్లి" ఆడియోకి మంచి స్పందన రావడమే కాకుండా ఈ చిత్రం అద్బుతంగా వచ్చిందన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుండడంతో 'నాగవల్లి" భారీగా బిజినెస్ జరుపుకుంటోంది.
ఇక అసలు విషయంలో లోకి వస్తే ఈ చిత్రంలో రాజుగా..సైక్రియాట్రిస్ట్ గా ద్విపాత్రాభినయం చేసిన విక్టరీ వెంకటేష్ కొన్ని సన్నివేశాలకు అనుగుణంగా మరికొన్ని డిఫరెంట్ గెటప్స్ లోనూ దర్శనమిచ్చారట. వాటిలో అఘోరాను పోలిన ఓ గెటప్ తో వెంకీ చేసిన విన్యాసాలు వీక్షకులకు విస్మయానందాన్ని కలిగించే రీతిలో వున్నట్లు సమాచారం. మొత్తానికి పలు వెరైటీ గెటప్స్ తో కనిపిస్తూ..తన నటనలోని వేరియేషన్స్ ని చూసిస్తూ 'నాగవల్లి"లో వెంకీ విశ్వరూపం చూపారనీ, కెరీర్ బెస్ట్ పెర్ ఫార్మెన్స్ ని ప్రదర్శించారనీ టాక్.


Click it and Unblock the Notifications











