వెంకటేష్ నోట బూతులా? రానా నాయుడు సిరీస్ ట్రైలర్‌లో అశ్లీలంగా, అసభ్యంగా డైలాగ్స్‌పై రచ్చ
తెలుగు సినిమా పరిశ్రమలో విక్టరీ వెంకటేష్‌కు క్లీన్ ఇమేజ్‌తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్ పరంగా మంచి ఫాలోయింగ్ ఉంది. తన ఫాలోయింగ్‌కు తగినట్టుగా వెంకటేష్ సంప్రదాయ పాత్రలను పోషిస్తూ తనకంటూ మహిళా ప్రేక్షకులను సంపాదించుకొన్నారు. అలాంటి వెంకటేష్ ఇటీవల కాలంలో విభిన్నమైన పాత్రలు, తన వయసుకు తగిన రోల్స్‌తో ప్రేక్షకుల ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలోనే వెంకటేష్ చేసిన వెబ్ సిరీస్ రానా నాయుడు ట్రైలర్ ఇటీవల రిలీజై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. అయితే తన ఇమేజ్‌కు భిన్నంగా వెంకటేష్ చెప్పిన డైలాగ్స్ రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వివాదాస్పద డైలాగ్స్ విషయంలోకి వెళితే...

భిన్నంగా వెంకటేష్ కొత్త పాత్రలో
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం హిందీ, తెలుగు భాషల్లో ఓటీటీ వస్తున్న రానా నాయుడు వెబ్ సిరీస్‌లో నటించారు. అంతకు ముందు కూడా హిందీలో రెండు, మూడు సినిమాలు చేసి బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇక రానా నాయుడు సిరీస్‌లో మాస్, రస్టిక్ పాత్రలో మాఫియా డాన్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు పోషించిన పాత్రలకు భిన్నంగా వెంకటేష్ కొత్త పాత్రలో కనిపించబోతున్నాడనేది స్పష్టమైంది.

బూతు డైలాగ్స్‌తో వెంకీ
అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ పుష్కలంగా ఉన్న వెంకటేష్ రానా నాయుడు సినిమాలో బూతుల వర్షం కురిపించారు. క్లీన్ ఇమేజ్ ఉన్న వెంకీతో.. గాండ్, గుర్దా, గూ అనే డైలాగ్స్ చెప్పించడం ట్రైలర్‌లో కనిపించింది. అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ మాత్రం వెంకీ పాత్ర కోసం ఇలా కూడా చేస్తారా? అనే ఓ వర్గం ప్రేక్షకులు మాట్లాడుకొంటున్నారు.

అసభ్య పదజాలం ఉపయోగిస్తూ
సాధారణంగా వెంకీ ప్రెస్‌తో మాట్లాడినప్పుడుల్లా అధ్యాత్మికం గురించి, దైవ చింతన గురించి తన అభిప్రాయాలను చెప్పేస్తుంటాడు. అలాంటి ఓ హీరోతో అసభ్య పదజాలం, బూతులు చెప్పించడం సమంజసమేనా అనే మాట వినిపిస్తున్నది. అంతేకాకుండా ఇలాంటి పాత్రలు చేయడం కూడా కరెక్టేనా అని వెంకీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

వెంకీ విగ్గు కూడా సెట్ కాలేదా?
ఇక రానా నాయుడు సిరీస్ కోసం నాగ పాత్రలో కనిపించిన వెంకటేష్ ఆహార్యం కూడా అభిమానులను నిరాశకు గురిచేసింది. మాఫియా డాన్, వయసు మళ్లిన పాత్ర కోసం వాడిన విగ్గు కూడా చెండాలంగా ఉంది. వెంకీ స్టామినాకు తగినట్టుగా లుక్ లేకపోవడంపై కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. వెంకటేష్ ఇమేజ్‌ను దెబ్బ తీసేలా లుక్ ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

మార్చి 10 తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో
విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కలిసి నటించిన రానా నాయుడు మార్చి 10వ తేదీన నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ పెద్దగా ఆకట్టుకొలేకపోయింది. అయితే ఈ వెబ్ సిరీస్ అమెరికన్ క్రైమ్, డ్రాగా రూపొందిన రే డోనవాన్ అనే టెలివిజన్ సిరీస్‌కు రీమేక్. ఇండియన్ ఆడియెన్స్ అభిరుచికి తగినట్టుగా మార్పులు చేర్పులు తీసి.. రానా నాయుడుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రానా భాష, వేషధారణపై ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో మార్చి 10వ తేదీన తేలుతుంది.


Click it and Unblock the Notifications











