విజయ్ దేవరకొండ సుదీర్ఘమైన లిప్‌లాక్.. హీరోయిన్‌ కూడా రెడీ.. సౌత్‌లోనే రికార్డట..

Recommended Video

Vijay Devarakonda And Rashi Khanna Longest Kiss Ever In Tollywood || Filmibeat Telugu

టాలీవుడ్‌లో అతి కొద్దికాలంలోనే విజయ్ దేవరకొండ క్రేజీ హీరోగా మారిపోయారు. అర్జున్ రెడ్డి తర్వాత ప్రతీ మూవీలోనూ సింబాలిక్‌గా లిప్‌లాక్ సర్వసాధారణమైంది. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీని తలపించేలా ముద్దులతో వెండితెరను ముంచెత్తుతున్నాడు. గత చిత్రాలు గీతా గోవిందం, నోటా, టాక్సీవాలా సినిమాల్లో విజయ్ దేవరకొండ ముద్దులతో ప్రేక్షకులను రంజింప చేశాడు. తాజాగా ఆయన హీరోగా తెరకెక్కుతున్న చిత్రాల్లో కూడా ముద్దులకు కొదవలేదంటున్నాయి సినీ వర్గాలు.. విజయ్ దేవరకొండ ముద్దుల వివరాల్లోకి వెళితే..

 డియర్ కామ్రేడ్‌ మూవీలో

డియర్ కామ్రేడ్‌ మూవీలో

తాజాగా విడుదలకు సిద్ధమవుతున్న డియర్ కామ్రేడ్ చిత్రంలో విజయ్ దేవరకొండ టీజర్‌లోనే ముద్దు రుచి చూపించారు. ఇక తాజా లిప్‌లాక్‌తో హీరోయిన్ రష్మిక మందన్న రెండోసారి ఇబ్బందుల్లో పడింది. బ్రేకప్ ముందు.. తర్వాత ముద్దుల్లో మునిగిపోతున్నావు అంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఇలాంటివేమీ పట్టించుకోకుండా విజయ్‌తో నటించే హీరోయిన్లందరూ లిప్‌లాక్‌లకు వెనుకాడటం లేదంటున్నారు.

ఇంట్రెస్టింగ్‌గా ముద్దు సీన్‌తో

ఇంట్రెస్టింగ్‌గా ముద్దు సీన్‌తో

డియర్ కామ్రేడ్ తర్వాత దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కేఎస్ రామారావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కనీసం నలుగురు హీరోయిన్లతో విజయ్ దేవరకొండ రొమాన్స్ చేస్తున్నారనే తెలిసిందే. అందులో హీరోయిన్ రాశీ ఖన్నాతో ముద్దు సీన్ ఇండస్ట్రీలోనే టాప్‌గా నిలుస్తుందనే తాజా సమాచారం.

సుదీర్ఘమైన లిప్‌లాక్‌తో విజయ్ దేవరకొండ

సుదీర్ఘమైన లిప్‌లాక్‌తో విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు క్రాంతి మాధవ్ ఓ సుదీర్ఘమైన లిప్‌లాక్‌ సీన్ డిజైన్ చేశాడట. ఈ సీన్ ఇప్పటి వరకు దక్షిణాది సినీ పరిశ్రమలోనే అతి సుదీర్ఘమైన ముద్దుగా నిలుస్తుందనేది తాజా సమాచారం. సినిమా కథలో ముద్దు కీలకంగా మారుతుందనే చెప్పుకొంటున్నారు. స్క్రిప్టు డిమాండ్ చేస్తుండటంతో విజయ్ దేవరకొండ, రాశీఖాన్నా కూడా సై అన్నారట.

ముద్దుకు కేరాఫ్ అడ్రస్‌గా విజయ్ దేవరకొండ

ముద్దుకు కేరాఫ్ అడ్రస్‌గా విజయ్ దేవరకొండ

ఇప్పటి వరకు ముద్దులంటే బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఖాన్ గుర్తొచ్చేవారు. దక్షిణాదిని అంతగొప్పగా ముద్దులతో ముంచెత్తిన హీరో ఎవరు అంతగా కానరాలేదు. ఇటీవల కాలంలో విజయ్ దేవరకొండ ముద్దులకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాడు. క్రాంతి మాధవ్ ముద్దు ఎలాంటి రికార్డు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X