కీలక పదవి రేసులో కమెడియన్ ఆలీ.. ఇచ్చిన మాట కోసం వైఎస్ జగన్
Recommended Video
టాలీవుడ్‌లో టాప్ కమెడియన్ కమ్ హీరో ఆలీ సినీ రంగంలో సత్తా చాటుకొని ఇటీవల రాజకీయం రంగంపై దృష్టిపెట్టాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి వివాదాలమయంలో చుట్టుకొన్నారు. గతంలో టీడీపీకి దగ్గరగా ఉండే ఆలీ.. ఆ తర్వాత అనూహ్యంగా షాకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరడం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత కొన్ని వివాదాల్లో తలదూర్చినప్పటికీ.. పెద్దగా ఆయనకు ఎఫెక్ట్ ఇవ్వకపోవడం గమనార్హం. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రేజీ ఆఫర్‌ను ఆయనకు ఇచ్చేందుకు ఓ హామీ చేశారనే వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఆలీకి అసలు ఏం పదవి దక్కనున్నదంటే..

వివాదాలతో ఆలీ పాలిటిక్స్‌లోకి
ఆలీ రాజకీయ ప్రవేశం అనేక గందరగోళాలకు, వివాదాలకు వేదికైంది. టీడీపీ తరఫున రాజమండ్రి సీటు నుంచి పోటీ చేస్తున్నారని ఓ సారి, అలాగే జనసేనలో చేరుతున్నాడని మరోసారి వార్తలు వైరల్ అయ్యాయి. ఎందుకంటే ఆలీ మూడు పార్టీల నాయకులను కలువడం గందరగోళానికి కారణమైంది. చివరకు టీడీపీ, జనసేన కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అంతా షాక్ అయ్యారు.

ఎన్నికల్లో పోటీకి దూరంగా అలీ
గత ఎన్నికల్లో పోటీ చేస్తారనుకొన్న ఆలీ ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. పార్టీ కోసం ఆంధ్రాలో ప్రచారం చేశారు. ఆ సందర్భంగా పదవిని ఆశించి పార్టీలో చేరలేదని స్పష్టం చేశారు. పదవులు, డబ్బు తనకు ముఖ్యం కాదని, ప్రజాసేవ చేయాలనుకొంటున్నాను అని స్పష్టం చేశారు. తాజాగా ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడటంతో ఇక పదవుల పందేరం మొదలైంది. ఈ క్రమంలోనే ఆయనకు ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తారనేది తాజా సమాచారం.

ఆలీకి ఎమ్మెల్సీ పోస్ట్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చివరి నిమిషంలో చేరడం వల్ల పోటీకి వీలు కాలేదు కాబట్టి.. ఆలీకి మంచి పోస్టు ఇవ్వాలని వైసీపీ భావిస్తున్నదట. దాంతో జగన్ కూడా ఆలీకి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి మంత్రిగా చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. గతంలో తనకు ఎవరు మంత్రి పదవి ఇస్తే వారి పార్టీలో చేరుతానన్న వ్యాఖ్యలు సంచలనం రేపడం తెలిసిందే.

మంత్రి పోస్టు ఇవ్వాలని వైఎస్ జగన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో ఇచ్చిన హామీ మేరకే ఆలీకి ఎమ్మెల్సీ పదవిని కట్టుబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఆలీ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత మంచి పోస్టులో నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నారు అనే వార్త వైరల్‌గా మారింది. అయితే ఆలీ ఎప్పుడు ఎమ్మెల్సీ అవుతారనేది త్వరలోనే అధికారికంగా తెలుస్తుందని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











