బాలకృష్ణను చూస్తే ముచ్చటేసిందంటోంది

By Srikanya

హైదరాబాద్ : బాలకృష్ణ సరసన నటించే అవకాశం ఇంత తొందరగా వస్తుందనుకోలేదు. ఆయనతో నటించడం మర్చిపోలేని అనుభూతి. స్టార్‌ హీరో అయ్యుండి కూడా తోటి నటీనటులతో కలిసిపోయే పద్ధతి చూస్తే ముచ్చటేసేది. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నా మూడో చిత్రం కూడా విజయవంతం అయినందుకు ఆనందంగా ఉంది. ఇద్దరు హీరోయిన్స్ ఒకే చిత్రంలో నటించినంత మాత్రాన నష్టమేమీ లేదు. ఎవరి పాత్ర వాళ్లదే అని ఇషా ఛావ్లా చెప్పింది.

ఇషా ఛావ్లా 'ప్రేమకావాలి', 'పూలరంగడు', తాజాగా 'శ్రీమన్నారాయణ' చిత్రాలతో హ్యాట్రిక్‌ విజయాలు అందుకుంది. ఈ మూడూ ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌ సంస్థ ఇచ్చిన అవకాశాలే. 'శ్రీమన్నారాయణ'లో బాలకృష్ణతో సయ్యాటలాడిన ఈ భామ..బాలయ్య బాబుకి మరదలి పాత్రలో నటించడం తనకెంతో ఆనందాన్నిచ్చిందని సంతోషాన్ని వ్యక్తపరిచింది. మరిన్ని సంగతులు ఎల్లోఫ్లవర్స్‌ సంస్థ కార్యాలయంలో ముచ్చటిస్తూ చెప్పుకొచ్చింది.

అలాగే ''అందాలు ఆరబోయడం కోసమే హీరోయిన్ ని కాలేదు. అభినయ ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించి అందర్నీ మెప్పించాలనేది నా లక్ష్యం. ఆ దిశగానే నేను అడుగులు వేస్తున్నాను'' అని చెప్పింది ఇషా చావ్లా. ఇక 'శ్రీమన్నారాయణ' చిత్రంలో గ్లామర్‌ మోతాదు పెంచినట్లున్నారు అని అడగ్గా ''కథాపరంగా చేయక తప్పలేదు. కానీ అదే నా లక్ష్యం కాదు. నేను పోషించే పాత్రలు ఇంటిల్లిపాదీ చూసేలా ఉండాలని కోరుకుంటాను. నాకు వీలైనంతలో అలాంటి పాత్రలే చేస్తాను''అని చెప్పింది.

ఇక ...ఎక్స్‌పోజింగ్‌ అవసరం మేరకే...గ్లామర్‌ అనేది సినిమాకి అవసరమే. సన్నివేశానికి అవసరం అంటేనే చేస్తాను. ఏమాత్రం హద్దులు దాటను. ఎబ్బెట్టుగా ఉండేలా దుస్తులు ధరించడం నాకు ఇష్టం ఉండదు. నాకు నప్పే డ్రెస్‌లనే ఎప్పుడూ వేసుకుంటాను. 'శ్రీమన్నారాయణ'లోనూ ఎక్కడా అసభ్యంగా కనిపించను. ఒకే ఒకచోట బాలయ్యతో రొమాన్స్‌ పండించాల్సి వచ్చినప్పుడు కాసింత గ్లామర్‌గా కనిపిస్తాను. అలాగే నటనకు ఆస్కారమున్న పాత్రలకే నా ప్రాధాన్యత అంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X