twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘శ్రీమన్నారాయణ’లో హద్దు దాటా సారీ

    By Srikanya
    |

    హైదరాబాద్: 'శ్రీమన్నారాయణ' లో ఒక పాటలో ఎక్స్‌పోజింగ్ పరంగా కొంచెం హద్దు దాటినట్లనిపించింది. అందుకు నేను ప్రేక్షకులకు 'సారీ' చెబుతున్నాను. వాస్తవానికి నాకు హోమ్లీ పాత్రలంటే ఇష్టం. ఇకముందు ఎక్స్‌పోజింగ్‌పరంగా హద్దు దాటను అంది ఇషా ఛావ్లా. బాలకృష్ణ, పార్వతీమెల్టన్, ఇషాచావ్లా కాంబినేషన్ లో రవి చావలి దర్శకత్వంలో రమేష్ పుప్పాల నిర్మించిన 'శ్రీమన్నారాయణ'. క్రిందటి శుక్రవారం ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

    అలాగే ...కథ డిమాండ్ చేసినా బికినీ వేసుకోవడానికి ఒప్పుకోను. ఈ చిత్రంలో 'బావా, అలా చూడొద్దు బావా...' అని ఒక డైలాగ్ చెబుతాను. బావా.. బావా అనడం, మిగతాది వదిలేయడం.. మళ్లీ డైలాగ్ బట్టీపట్టడం... ఇలా ఆ సీన్‌కి ఎక్కువ టేక్స్ తీసుకున్నాను. ఇంతకుముందు చేసిన చిత్రాలతో గుర్తింపు వచ్చినప్పటికీ, 'శ్రీమన్నారాయణ' నన్ను ప్రేక్షకులకు బాగా దగ్గర చేసింది. ఒక పెద్ద సినిమా చేయడంవల్లే ఈ గుర్తింపు అంటూ ఆనందంతో చెప్పుకొచ్చింది.

    ఇక ఒక సీనియర్ ఆర్టిస్ట్ నుంచి అప్‌కమింగ్ ఆర్టిస్ట్ అభినందనలు అందుకుంటే ఆ ఆనందమే వేరు. 'ఆ అమ్మాయి మంచి ఆర్టిస్ట్' అని బాలకృష్ణగారు ఇచ్చిన కాంప్లిమెంట్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. బాలకృష్ణగారు పెద్ద హీరో అయినప్పటికీ అందరితో స్నేహంగా ఉండటం మాత్రమే కాదు ప్రోత్సహించడం గొప్ప విషయం. ఈ చిత్రంలో మాస్ సాంగ్స్ చేశాను అన్నారు ఇషాచావ్లా.

    ప్రేమకావాలి, పూలరంగడు తర్వాత నటించిన చిత్రం 'శ్రీమన్నారాయణ'. ఈ చిత్రం కూడా హిట్ కాబట్టి, 'హ్యాట్రిక్ కొట్టావ్' అని అంటున్నారు. అందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి అవకాశం వచ్చినప్పుడు నమ్మలేకపోయాను. సినిమా పూర్తయ్యేంతవరకు అదే ఫీలింగ్‌తోనే ఉన్నాను. చివరి రోజున 'ఓకె.. మనం నిజంగానే ఈ సినిమాలో యాక్ట్ చేశాం' అనిపించింది. ఇది నాకు మంచి అవకాశం. ప్రస్తుతం సునిల్ సరసన 'తను వెడ్స్ మను' రీమేక్ చిత్రంలో నటిస్తున్నానని, కన్నడంలో దర్శన్ సరసన ఓ చిత్రం చేస్తున్నానని ఇషా చెప్పింది.

    English summary
    Srimannarayana starring Nandamuri Balakrishna, Parvathi Melton and Isha Chawla in leads is a romantic action film and it has received mixed reviews from film critics. Balakrishna's performance, Parvathi-Isha's glamour and Chakri music are its big attractions and predictable story is its drawback.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X