ప్రేమ కావాలి హీరోయిన్ తో రామ్ చరణ్ రొమాన్స్..
సినీ పరిశ్రమలో కుర్ర హీరోలు, హీరోయిన్లు సహజంగా రొమాన్స్ పడటం, వాటిని పత్రికలు మీడియా హైలెట్ చేయటం సాధారణంా జరుగుతున్న మేటరు. అయితే హీరో రామ్ చరణ్ తేజ్ ఒక అందాల భామతో వెండితెరపై రొమాన్స్ చేయనున్నారు. ఇంతకి రామ్ చరణ్ తో రొమాన్స్ చేయబోయే ఆ హీరోయిన్ ఏవరంటే? ఈ మధ్యనే రామ్ చరణ్ 'ప్రేమకావాలి" సినిమాలో నటించిన హీరోయిన్ ఇషా చవ్లాపై మనసు పారేసుకున్నట్లుంది. తన తదుపరి చిత్రానికి హీరోయిన్ గా ఈ అందాల భామను రికమెండ్ చేసినట్లు ఫిలింనగర్ లో వార్తలు వచ్చాయి.
రామ్ చరణ్ కి జంటగా ఇషాచవ్లా బాగా ఉంటుందని రామ్ చరణ్ తో పాటు, సినీ పండితులు కూడా అభిప్రాయపడుతున్నారట. 'ఇషా చవ్లా" నటించబోయే ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు ఇషా చవ్లాను రికమెండ్ చేసింది రామ్ చరణేనని ఆమె స్నేహితులు కూడా ఖచ్చితంగా చెప్పటంతో, ఇషా చావ్లా జాతకమే మారిపోతుందని ఫిలింనగర్ లో అనుకుంటున్నారు. ఇలాంటి అవకాశం వచ్చినందుకు ఇషా చావ్లా తెగ సంబరపడిపోతుందని సమాచారం.


Click it and Unblock the Notifications











