twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య ముద్దు ఎఫెక్ట్ : హీరోయిన్ రాంరాం!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : ప్రేమ కావాలి, పూల రంగడు చిత్రాలు మంచి విజయం సాధించడంతో ఆ చిత్రంలో హీరోయిన్‌‍గా నటించిన ఇషా చావ్లాలకు అభిమానులు ఏర్పడ్డారు. ఆమె ట్విట్టర్‌కు అభిమాను తాకిడి కూడా బాగానే ఉండేది. తాజాగా ఇషా చావ్లా 'ట్విట్టర్' నుంచి అకౌంట్‌‍ను క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ట్విట్టర్ నుంచి తప్పుకుంటున్నందుకు బాధగా ఉన్నా తప్పడం లేదని పేర్కొంది.

    ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం....ఇటీవల బాలకృష్ణ 'శ్రీమన్నారాయణ' చిత్రంలో నటించిన ఇషా చావ్లా ఆచిత్రంలోని 'తకతై తకతై' అనే సాంగులో రెచ్చి పోయి బాలయ్యతో రొమాన్స్ చేసింది. ఈ సాంగులో బాలయ్యకు ఇషా చావ్లా లిప్ లాక్ ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. అయితే అది అనుకోకుండా జరిగిందే అని, అది లిప్ లాక్ ముద్ద కాదని అంటోంది ఈ హీరోయిన్. బాలయ్యతో ముద్దు సీన్‌పై కామెంట్లు తట్టుకోలేకే ఇషా ట్విట్టర్‌కు రాంరాం చెప్పినట్లు చర్చించుకుంటున్నారు.

    బాలయ్యతో రొమాన్స్‌లో రెచ్చి పోవడంతో ఆమెపై కామెంటు రావడంతో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇషా మాట్లాడుతూ.... 'శ్రీమన్నారాయణ' సినిమాలో ఒక పాటకు కాస్త హద్దులు దాటి ఎక్స్‌పోజింగ్ చేశానని.. అందుకు అభిమానులు తనను మన్నించాలని, తనకు హోమ్లీ పాత్రలంటేనే ఇష్టమని.. ఇకపై ఎక్స్‌పోజింగ్‌ విషయంలో హద్దుదాటనని చెప్పింది.

    ప్రస్తుతం ఇసా చావ్లా సునీల్ సరసన నటిస్తోంది. సునీల్‌, ఇషాచావ్లా కాంబినేషన్‌లో పూలరంగడు తర్వాత మళ్ళీ మరో చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ మూవీ 'తను వెడ్స్ మను' చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈచిత్రాన్ని మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బేనర్‌పై ఎన్‌.వి. ప్రసాద్‌, పరాస్‌జైలు నిర్మిస్తున్నారు. దేవీప్రసాద్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

    English summary
    "Sorry to those who don like it but I quit twitter today ... Thanks for all d love u guys gave till now...alvida have a great life, Thanks 2 those who believe me n also those who don't... At least I learnt today that being true to ur audience is not worth it" Isha Chawla tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X