సునీల్ హీరోయిన్‌కు బాలీవుడ్ ఆఫర్

తెలుగులో 'పూలరంగడు' తర్వాత మరోసారి సునీల్‌తో జోడిగా ఈ సుందరి నటించనుంది. బాలీవుడ్ హిట్ చిత్రం 'తనూ వెడ్స్ మను' ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి దేవీ ప్రసాద్ దర్శకత్వం వహించనున్నాడు. ఇక పూల రంగడు సినిమా జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
సునీల్, ఇషాచావ్లా ప్రధాన పాత్రధారులు కాగా కోట శ్రీనివాసరావు, అలీ, ప్రదీప్ రావత్, రఘుబాబు, దేవ్‌గిల్, పృథ్వి, సుధ, ప్రగతి, శ్రీలలిత, సత్యం రాజేష్, దువ్వాసి మోహన్, ఖలీల్, ప్రవీణ్, వేణుగోపాల్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కళ: నాగేంద్ర, మాటలు: శ్రీధర్ సీపన, కూర్పు: గౌతంరాజు, కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ, సంగీతం: అనూప్ రూబెన్స్, సమర్పణ: ఆర్.ఆర్.మూవీ మేకర్స్, నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరభద్రం.


Click it and Unblock the Notifications











