హాట్ భామతో జహీర్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్

By Bojja Kumar

 have decided to tie the knot at the
బాలీవుడ్ నటి ఇషా శర్వానీ, క్రికెటర్ జహీర్ ఖాన్ మధ్య ప్రేమ బంధం ఉందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ ఇద్దరి పెళ్లికి పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది. మార్చిలో వివాహం ఉంటుందని, త్వరలోనే నిశ్చితార్థ ప్రకటన చేసే ఆలోచనలో ఉన్నారని బాలీవుడ్ టాక్.

2005లో ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు ఓ వేడుక ఏర్పాటు చేశారు. అందులో ఇషా శర్వానీ నృత్యం చేసింది. ఈ క్రమంలోనే జహీర్, ఇషా మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ముదిరి స్నేహానికి, ఆపై ప్రేమకు దారి తీసింది. గత ఆరేళ్లుగా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తూనే ఉంది. ఇద్దరూ రహస్యంగా కలుసుకోవడం లాంటివి కూడా చేస్తుండే వారట.

విషయం పెద్దవాళ్ల వరకు వెళ్లడంతో ఇరు కుటుంబాల వారు పరస్పరం సంప్రదింపులు జరుపుకుని పెళ్లి విషయాన్ని ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇషా కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వరూపం చిత్రంలో నటిస్తోంది. క్రికెటర్లకు, సినీ తారలకు మధ్య ప్రేమాయణాలు ఇది కొత్తేం కాదు. గతంలో చాలా మంది ఇదే తరహాలో ఏకమైన వారే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X