సంపూర్ణేష్ బాబుకు పోటీగా ఈవిడ సెక్సీ చేష్టలు (ఫోటోలు)
హైదరాబాద్: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఈ రోజు బాబు నటించిన 'హృదయ కాలేయం' చిత్రం విడుదలైంది. ఓ వైపు సినిమా విడుదల సందర్భంగా ట్రైలర్లతో సంపూర్ణేష్ బాబు బీభత్సం సృష్టిస్తుంటే....మరో వైపు ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఇషికా సింగ్ తన సెక్సీ చేష్టలతో సినిమాకు ప్రచారం కల్పించడమే పనిగా పెట్టుకుంది.
సినిమా విడుదల సందర్భంగా ఫోటో షూట్లో పాల్గొన్న ఆమె తను వేసుకున్న బట్టలను లాగేసుకుని మరీ అందాలను చూపించే ప్రయత్నం చేసింది. అయితే ఆమె అందాల ప్రదర్శ కాస్త ఓవర్‌గా ఉండటంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. మరీ ఇంతగా చించుకోవాల్సిన పని లేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
స్లైడ్ షోలో ఇషికా సింగ్ ఫోటోలు, హృదయ కాలేయం చిత్రానికి సంబంధించిన వివరాలు...

హృదయ కాలేయం
యూ ట్యూబ్ లో, ఫేస్ బుక్, ట్విట్టర్ లలో ఈ మధ్య కాలంలో ఇంత క్రేజ్ తెచ్చుకున్న తెలుగు చిత్రం లేదనే చెప్పాలి.

నేడే విడుదల
ఫస్ట్ లుక్ నుంచి ఓ విభిన్న చిత్రంగా ప్రచారమవుతూ వస్తున్న ఈ సినిమా అందరూ కొత్తవాళ్ళతో ఓ ప్రెష్ ఫీల్ తో ముస్తాబయ్యి ఈ రోజు విడుదలయింది.

బిజినెస్ పరంగా క్రేజ్
బిజినెస్ పరంగా కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం కేవలం సోషల్ నెట్ వర్కింగ్ జనాలకే పరిమితమా లేక రెగ్యులర్ సినీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుందా అనేది ఈ రోజు ఓపినింగ్స్ ని బట్టి తెలుస్తుంది.

సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ..
ఇది ఏ చిత్రానికీ వ్యంగ్యరూపం కాదు. కుటుంబం మొత్తం చూడదగ్గ ప్రేమకథా చిత్రమిది. దర్శకుడు స్టీవెన్ శంకర్ సినిమాను తెరకెక్కించిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. యాక్టర్ కావాలనేది నా కల. కథ వినగానే సినిమా చేయడానికి సిద్ధమయ్యాను అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ...
దర్శకుడు మాట్లాడుతూ ''దక్షిణ అమెరికా, జర్మనీలో విడుదలవుతున్న తొలి తెలుగు చిత్రమిది. ప్రతి సన్నివేశం హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది. పక్కా కమర్షియల్ సినిమా ఇది. సినిమాను 29 రోజుల్లో పూర్తి చేశాం. నా టీమ్ లేకపోతే ఈ సినిమా లేదు. అందుకే నేను ఎ ఫిల్మ్ బై అని నా పేరు వేసుకోలేదు'' అన్నారు.

ఇతర వివరాలు
బ్యానర్: అమృత క్రియేషన్స్
నటీనటులు: సంపూర్ణేష్ బాబు కావ్య కుమార్, ఇషికాసింగ్, కత్తి మహేష్ తదితరులు
సంగీతం: కెకే
నృత్యాలు: హరి
ఫైట్స్: స్టంట్స్ జాషువా
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: స్టీవెన్ శంకర్
నిర్మాత: సాయి రాజేష్
విడుదల తేదీ: 04, ఏప్రియల్ 2014.


Click it and Unblock the Notifications











