»   » ఇండియన్ సినిమాలోనే తొలిసారంట: బూతు పోస్టర్‌తో షాకిచ్చారు!

ఇండియన్ సినిమాలోనే తొలిసారంట: బూతు పోస్టర్‌తో షాకిచ్చారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హాలీవుడ్ సినిమాల్లోని కొత్త కొత్త కాన్సెప్టులన్నీ క్రమ క్రమంగా బాలీవుడ్లోనూ మొదలవుతున్నాయి. హాలీవుడ్ తరహాలో సెక్స్ కామెడీ చిత్రాల జోరు ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో బాగా పెరిగింది. తాజాగా మరో కొత్త కాన్సెప్టు సినిమా ఇండియన్ స్క్రీన్ మీద రాబోతోంది. అదే... ‘త్రీసమ్ లవ్' అనే కాన్సెప్టు. అంటే ముగ్గురు కలిసి ప్రేమించుకోవడం అన్నమాట. ముగ్గురూ ఇష్టప్రకారమే లవ్ చేసుకోవడం.

Ishq Junoon Motion Poster

ఇలాంటి కాన్సెప్టుతో తొలిసారిగా బాలీవుడ్లో ‘ఇష్క్ జనూన్' అనే సినిమా వస్తోంది. ‘ది హీట్ ఈజ్ ఆన్' అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి సంజయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ బీర్ సింగ్, దివ్యా సింగ్, అక్షయ్ రంగ్‌షాహి ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కతోంది. వినయ్ గుప్తా, అంజు శర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సోను నిగమ్, జీత్ గంగూలీ, అంకిత్ తివారీ, అంజన్ భట్టాచార్య సంగీతం అందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసారు. పోస్టర్ లుక్ షాకింగ్ గా ఉంది. పోస్టర్లో మాత్రం నటీనటుల ఫేసులు కనిపించడంలేదు. అయితే పోస్టర్ మాత్రం ఇదో బూతు సినిమా అనే అభిప్రాయాన్ని కలిగించే విధంగా ఉంది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ జోరు చూస్తుంటే హాలీవుడ్ కాన్సెప్టులన్నీ దించేట్టే ఉన్నారు. మున్ముందు ఇంకెన్ని బూతు పురాణాలు చూడాల్సి వస్తుందో?

English summary
Watch India’s First Threesome Based Film Ishq Junoon Motion Poster, starring Rajbeer Singh, Divya Singh and Akshay Rangshahi.
Please Wait while comments are loading...