ఇప్పట్లో లేదు: కొడుకు పోస్టర్‌తో కూల్ చేసిన రేణుదేశాయ్!
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ‘ఇష్క్ వాలా లవ్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తొలుత అక్టోబర్ 10 విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసిన రేణు దేశాయ్, ఆ తర్వాత అక్టోబర్ 17 కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఆ రోజు కూడా విడుదల సాధ్యంకాలేదు. తర్వాత అక్టోబర్ 24న అనుకున్నప్పటికీ సాధ్యమయ్యే పరిస్థితి కనిపించక పోవడంతో.....రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు అంటూ తన సోషల్ నెట్వర్కింగ్ పేజీ ద్వారా సందేశం పంపింది.

అయితే సినిమా వాయిదాల మీద వాయిదా పడుతుండటంతో ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నారు. వాళ్లను కూల్ చేస్తూ ఈ విషయం తెలియజేయడానికి అకీరానందన్ ఫోటోతో కూడిన పోస్టర్ విడుదల చేసింది రేణు దేశాయ్. అకీరా నటించిన తొలి సినిమా కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
‘ఇష్క్ వాలా లవ్' ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరతో కూడిన డ్రామా. ఆదినాథ్ కొఠారి, సులగ్నా పానిగ్రాహి లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి 'ఖుషి' చిత్ర దర్శకుడు ఎస్.జె.సూర్య రెండు సాంగులను కంపోజ్ చేసాడు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా కూడా ఓ చిన్న పాత్రలో కనిపించనున్నాడు. తెలుగులో కలెక్షన్లు రాబట్టేలనే ముఖ్య ఉద్దేశ్యంతో అకీరాతో గెస్ట్ రోల్ చేయించినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











