కలెక్షన్ల కోసమే పవన్ కళ్యాణ్ కొడుకుతో..?

By Bojja Kumar

హైదరాబాద్: పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ మరాఠీలో ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. తన కూతురు పేరు మీద ‘శ్రీ ఆద్య ఫిలింస్' అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించింది. ఇప్పటికే ‘మంగలాష్ తక్ వన్స్ మోర్' అనే చిత్రాన్ని నిర్మించి విజయం సొంతం చేసుకున్నారు రేణు దేశాయ్.

తాజాగా ఆమె స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ‘ఇష్క్ వాలా లవ్' అనే మరాఠీ చిత్రం చేస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో అనువాదం చేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని రేణు దేశాయ్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ కుడా గెస్ట్ రోల్ చేస్తుండటం గమనార్హం. అయితే తెలుగులో కలెక్షన్లు రాబట్టేలనే ముఖ్య ఉద్దేశ్యంతో అకీరాతో గెస్ట్ రోల్ చేయించినట్లు సమాచారం.

Ishq Wala Love to release in Telugu too

అకీరా నందన్ నటిస్తున్న తొలి సినిమా కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఈ చిత్రంపై ఆసక్తి చూపుతున్నారు. ఇదొక బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరతో కూడిన డ్రామా. ఆదినాథ్ కొఠారి, సులగ్నా పానిగ్రాహి లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఖుషి' చిత్ర దర్శకుడు ఎస్.జె.సూర్య రెండు సాంగులను కంపోజ్ చేసాడు.

రేణు దేశాయ్ ట్వీట్ చేస్తూ... ‘అకిరా నందన్ ‘ఇష్క్ వాలా లవ్' సినిమాలో గెస్ట్ రోల్లో నటిస్తున్నాడు. నా కుమారుడి తొలి సినిమా నా స్వీయ దర్శకత్వంలో తెరకేక్కడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు డబ్బింగ్ మొదలైంది. త్వరలో తెలుగు ట్రైలర్ కూడా విడుదల చేస్తాము' అంటూ సోషల్ మీడియాలో రేణు దేశాయ్ తన ఆనందాన్ని వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X