Don't Miss!
- News నామినేషన్ల పర్వంలో టీడీపీకి ఊహించని షాక్
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాగార్జున ఒత్తిడితో రేణు దేశాయ్ మరో వారం వెనక్కి!
హైదరాబాద్: రేణు దేశాయ్ స్వీయ నిర్మాణ దర్శతకత్వంలో తెరకెక్కిన ‘ఇష్క్ వాలా లవ్' చిత్రం అక్టోబర్ 17న విడుదల కావాల్సి ఉండగా...మరో వారం ఆస్యంగా అస్టబర్ 24కు వాయిదా పడింది. నాగార్జున నిర్మించిన ‘ఒక లైలా కోసం' చిత్రం ఎక్కువ థియేటర్లు ఆక్రమించడంతో రేణు దేశాయ్ సినిమా విడుదల వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది.
‘ఇష్క్ వాలా లవ్' ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరతో కూడిన డ్రామా. ఆదినాథ్ కొఠారి, సులగ్నా పానిగ్రాహి లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి 'ఖుషి' చిత్ర దర్శకుడు ఎస్.జె.సూర్య రెండు సాంగులను కంపోజ్ చేసాడు. తొలుత ఈచిత్రాన్ని అక్టోబర్ 10న విడుదల చేయాలనుకున్నారు. పరిస్థితులు అనుకూలించక పోవడంతో అక్టోబర్ 17న డేట్ ఫిక్స్ చేసారు. ఈ సారి కూడా రేణు దేశాయ్ సినిమా విడుదలయ్యే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఈ చిత్రం అక్టోబర్ 24కు వాయిదా పడింది. దీపావళి పండగ తర్వాత కాబట్టి కలిసొస్తుందని రేణు దేశాయ్ ఆశిస్తోంది.
‘ఇష్క్ వాలా లవ్' చిత్రంలో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా కూడా ఓ చిన్న పాత్రలో కనిపించనున్నాడు. తెలుగులో కలెక్షన్లు రాబట్టేలనే ముఖ్య ఉద్దేశ్యంతో అకీరాతో గెస్ట్ రోల్ చేయించినట్లు సమాచారం. అకీరా నందన్ నటిస్తున్న తొలి సినిమా కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ చిత్రంపై ఆసక్తి చూపుతున్నారు.