పవన్ సపోర్టు ఉందా? రేణు దేశాయ్ రాకపై చర్చ...

By Bojja Kumar

హైదరాబాద్: 'బద్రి' సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయమైన రేణు దేశాయ్.....ఆ సినిమా షూటింగు సమయంలోనే పవన్ కళ్యాణ్‌తో ప్రేమలో పడటం, అతనితో సహజీవనం మొదలు పెట్టడం, ఓ బిడ్డకు తల్లయిన తర్వాత అతన్ని పెళ్లి చేసుకోవడం తెలిసిందే. ఆమె నటిగా కొనసాగితే ఏ స్థాయిలో ఉండేదో తెలియదు కానీ...పవన్ కళ్యాణ్ పుణ్యమా అని 'జానీ' సినిమా తర్వాత ఆమె నటిగా సినిమాలకు పూర్తిగా దూరమైంది. పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసింది.

ఇటీవల ప‌వన్ కళ్యాణ్‌తో విడిపోయి మహారాష్ట్ర వెళ్లి పోయిన రేణు దేశాయ్ అక్కడ మరాఠీ చిత్రాల నిర్మాతగా అవతారం ఎత్తింది. మంగళాష్‌తక్ వన్స్ మోర్, ఇష్క్ వాలా లవ్ చిత్రాలతో నిర్మాతగా మారింది. తన కొడుకు, కూతురు అకీరా, ఆద్య ప్రాణంగా జీవిస్తోంది. చాలా కాలం తర్వాత రేణు దేశాయ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తోంది.

మరాఠీలో ఆమె స్వీయ నిర్మాణ దర్శకత్వంతో తెరకెక్కించిన 'ఇష్క్ వాలా లవ్' చిత్రాన్ని తెలుగులో అనువదించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్లో వెల్లడించారు. తెలుగు ఫ్యాన్స్ తన సినిమాను ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నట్లు ఆమె తెలిపారు. మరి రేణు దేశాయ్ నమ్మకం ఫలించాలని, ఆమె సినిమా విజయవంతం కావాలని కోరుకుందాం.

థియేటర్లపై బడా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల ఆధిపత్యం నడుస్తున్న నేపథ్యంలో.....చిన్నసినిమాల విడుదల చాలా కష్టమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్ సినిమా విడుదల విషయంలో పవన్ కళ్యాణ్ సపోర్టు ఉందా? అనే చర్చ సాగుతోంది.

కొడుకు కోసం పవన్‌పై ఒత్తిడి

కొడుకు కోసం పవన్‌పై ఒత్తిడి

వారసత్వాన్ని ప్రోత్సహించడం తనకు ఇష్టం ఉండదని, కొత్తవాళ్లు కూడా పరిశ్రమలోకి రావాలని పవన్ కళ్యాణ్ ఆ మధ్య ఓ ఫంక్షన్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆలోచన మాత్రం వేరేలా ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉన్నపుడే కొడుకు అకీరాను సినిమా రంగానికి పరిచయం చేయాలని, భవిష్యత్ స్టార్‌గా తీర్చి దిద్దాలని ఆశ పడుతోంది.

గబ్బర్ సింగ్ 2

గబ్బర్ సింగ్ 2

ఈ మేరకు ఆమె పవన్ కళ్యాణ్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గబ్బర్ సింగ్-2 చిత్రంలో ఏదో ఒక పాత్ర ద్వారా అకీరాను తెలుగు సినిమా ప్రవేశం చేయించాలని పవన్ కళ్యాణ్‌ను కోరుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

సొంతగా ఎదిగేందుకు

సొంతగా ఎదిగేందుకు

పవన్ కళ్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్ ఆయనతో విడిపోయిన తర్వాత తనకు తానుగా ఎదుగేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే నిర్మాతగా ప్రస్థానం ప్రారంభించిన రేణు దేశాయ్.....ఈ కాలంలో సినిమా తారలకు ముఖ్యంగా ఉండాల్సిన పాపులారిటీ, పబ్లిసిటీ పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.

సోషల్ మీడియా ద్వారా

సోషల్ మీడియా ద్వారా

ఇందుకు సోషల్ మీడియాను చాలా బాగా వాడుకుంటోంది రేణు దేశాయ్. ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగు సైట్లలో ఆసక్తికరమైన పోస్టులు చేస్తూ అభిమానుల పెంచుకుంటోంది. రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారిలో పవన్ కళ్యాణ్ అభిమానులే ఎక్కువగా ఉన్నారు. ఈ మధ్య తరచూ అభిమానులు అకీరా నందన్, ఆధ్యా ఫోటోలు పోస్టు చేయాలని కోరడంతో వారి కోరిక మేరకు వారి ఫోటోలు పోస్టు చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X