Chandrayaan 3 స్టెప్పులతో ఇరుగదీసిన ఇస్రో చైర్మన్.. ఏ పాటకు డ్యాన్స్ చేశారో తెలుసా?
చందమామపై చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావడం 130 కోట్ల భారతీయుల్లో ఆనందం వెల్లువిరుస్తున్నది. గత కొద్ది సంవత్సరాలుగా ఈ ప్రయోగం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బంది, సాంకేతిక నిపుణులు అహర్నిశలు శ్రమించారు. బుధవారం ఆగస్టు 23వ తేదీన చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టగానే సంవత్సరాలుగా పడిన శ్రమ నుంచి ఉత్సాహం పుంజుకొచ్చింది. చంద్రయాన్ 2 ప్రయోగం సక్సెస్ కాగానే ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. ఆ వీడియో వివరాల్లోకి వెళితే..
చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కాగానే శాస్త్రవేత్తల్లో ఆనందం ఆకాశాన్ని అంటుకొన్నది. ఈ ఆనంద వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ కూడా భాగమయ్యారు. సౌతాఫ్రికాలో ఉన్న ప్రధాని మోదీ శాస్త్రవేత్తలను ఉద్దేశించి అభినందన ప్రసంగం చేశారు. ఇస్రో సిబ్బందిని ప్రశంసలతో ముంచెత్తారు.

చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కాగానే ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే తన సిబ్బందితో కలిసి మంచీ మ్యూజిక్ బీట్ పెట్టుకొని డ్యాన్సులతో హోరెత్తించారు. సోమనాథ్ స్టెప్పులు వేస్తూ హుషారుగా వెస్ట్రన్ పాటకు డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకొంటున్నది.
అయితే చంద్రయాన్ 3 సక్సెస్‌ను ఇస్రో చైర్మన్ సోమనాథ్ తన స్నేహితులు, సన్నిహితులతో పంచుకొన్నారు. పబ్‌లో ఏర్పాటు చేసిన డ్యాన్స్ ఫ్లోరుపై లయబద్దంగా స్టెప్పులేసి కొన్నేళ్లుగా ఉన్న ఒత్తిడి నుంచి దూరమయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











